తిరుమలలో అటవీ
తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో ని ఈవో ఛాంబర్ లో జరిగిన ఈ సమా వేశంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం పా ల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ డీఎఫ్ఓ శ్రీ ఫణికుమార్ నాయుడు గత ఏడాది తి రుమలలో చేపట్టిన వృక్షారోహణ కా ర్యక్రమాలు, దశలవారీగా అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానం లో స్థానిక వృక్షజాతుల పెంపకం, ఔషధ వనాల అభివృద్ధి, సుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలు వంటి అం శాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకు న్న 20 వేల మొక్కల్లో భాగంగా ఇప్పటివరకు తాండ్ర, రావి, ఉసిరి , వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, అత్తి మరియు ఎర్రచందనం వంటి స్ థానిక జాతుల 7,000 మొక్కలు నాటి నట్టు వివరించారు. అదనంగా, వా టర్షెడ్ మరియు మట్టిస్థిరీకరణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నట్టు వివరించారు.
వన్యప్రాణుల నిర్వహణలో భాగంగా, అలిపిరి–తిరుమల మార్గాల రెండు వైపులా 60 కెమెరా ట్రాపులు, 31 సౌర శక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తె లిపారు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
ఈవో శ్రీ శ్యామలారావు అటవీ శాఖ అధికారులు మరింత ఆధునిక నిఘా కె మెరాలను ఏర్పాటు చేయడంతో పాటు తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థి రత ప్రణాళిక రూపొందించాలని ఆదే శించారు.


No comments :
Write comments