28.8.25

శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వినాయక చవితి vinayaka chawiti





తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితిని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో శ్రీ వినాయకస్వామి వారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు.
సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సుపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments