తిరుమలలో భక్
వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్ సిన ముందస్తు జాగ్రత్తలపై జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్ రీ మురళీకృష్ణలతో కలిసి, ఇతర తి .తి.దే అధికారులతో వర్చువల్ సమా వేశం నిర్వహించారు.
డిజాస్టర్ రెస్పాన్సివ్ టీమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసం ధానం చేసి చీఫ్ ఇంజనీర్ గారి నే తృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా పురాతన గోపురాలు మరియు కట్టడాల ధృడత్వం మరియు సంరక్షించే చర్యలలో భాగంగా ఒక సంస్థాగత విభాగం ఉంటే సబబుగా ఉం టుందని అభిప్రాయం వెలిబుచ్చారు.
భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్ న ప్రసాదాలు అందించేందుకు సమయపా లనా చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. భారీ వర్షాల సమయంలో క్యూలై న్లు బయటకు రాకుండా ఉన్న మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉపయోగిం చుకోవాలన్నారు. దీనికి అనుగుణం గా SSD టోకెన్ల జారీ తగ్గింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా సర్వదర్శనం భక్తులు త్ వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకో డానికి వీలుకలుగుతుందని తెలిపా రు.
భారీ వర్షాలకు కొండ చరియలు, చె ట్లు విరిగిపడితే ట్రాఫిక్ అం తరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీ వాహనాల ద్వారా తొలగించా లన్నారు. అటవీశాఖ మరియు రవాణా విభాగం వారికి సదరు ఆదేశాలు జా రీచేయడమైనది.
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తి .తి.దే లోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురై నప్పుడు త్వరితగతిన పరిష్కరించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎలక్ట్రికల్ మరియు ఐటీ విభాగాలు సమన్వయంతో భక్తులకు నిర్దేశిం చిన ఆన్ లైన్ సేవలో ఎక్కడ ఇబ్బం ది కలగకుండా చూడాలని మరియు విద్ యుత్తు సరఫరా ప్రదేశాలు మరియు జంక్షన్లు దగ్గర సరైన కంచె మరి యు సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయవలసినదిగా ఆదేశించారు. విద్ యుత్ విభాగాధిపతిని ఒక ప్రత్యే క విపత్తు స్పందన ఫోన్ నెంబర్ని కేటాయించి దానిని తిరుమల తి.తి .దే సిబ్బందికి మరియు భక్తులకి చేరే విధంగా సూచిక బోర్డులు ఏర్ పాటు చేయాలని అన్నారు.
ఇటు వంటి విపత్తు సమయాలలో వాట్ సాప్ సేవలను శాఖల పరంగా విస్తృ తంగా వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. దిగువ ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి మరియు మాల్వాడి గుండం పక్కన వర్షాకాల జలపాతాల వద్ద భక్తులు గుమికూడి సెల్ఫీలు తీసుకోకుండా భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. ఒక పెట్రోలింగ్ వాహనాన్ని నిరం తరాయంగా రెండు ఘాట్ రోడ్లలో నడి పి అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరవేయాల్సిం దిగా సూచించారు.
వర్షాకాలంలో భక్తులు జారీ పడకుం డా ఆలయం, మాడ వీధుల్లో నారతో తయారు చేసిన పట్టలు (కాయర్ మేట్ లు) ను ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. నీరు నిల్వ ఉండే ప్రాంతా ల్లో యంత్రాల ద్వారా ఎప్పటికప్ పుడు నీటిని తొలగించడంతో పాటు, ఆలయం, ఆలయ పరిసరాల్లో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలన్నారు . భూగర్భ మురుగు నీటిలో చెత్త చేరకుండా ఎప్పటికప్పుడు నిర్మూ లించి సజావుగా నీరు పోయే విధంగా చూసుకోవాలని సూచించారు. వర్షా ల సమయంలో విధులు నిర్వహించే ఉద్ యోగులు, కార్మికులకు రెయిన్ కో ట్లు ఇవ్వాలని ఆదేశించారు.
వేసవి, వర్షం, మంచు కాలాల్లో భక్తులు ఎదుర్కొనే సమస్యలను గు ర్తించి పరిష్కరించేందుకు వేర్ వేరుగా నిర్దేశిత ప్రణాళిక విధా నం (Sop)లు తయారు చేయాలని ఆయన ఆదేశించారు.
శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్, మాడ వీధుల్లో రంగ వల్లులు, కూల్ పెయింట్ వేసిన ప్రాంతాల్లో జా రి పడే ప్రమాదం ఉన్నందున, వాటి ని గరుకుగా చేసి భక్తులు జారకుం డా ఉండేదుకు తగు చర్యలు చేపట్టా లన్నారు. అదేవిధంగా వర్షం పడే సమయం చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తులు చెట్లు కింద ఉం డకూడదని సూచించారు. ఈ సందర్భంగా వైద్య విభాగానికి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది.

No comments :
Write comments