15.3.26

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు srivari temple




తెలుగు ఉగాదిశ్రీరామనవమి ముఖ్య పండుగలను పురస్కరించుకుని  మార్చి నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు.


ఆస్థానం అనేది ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహాంచే ఆలయ దర్బారుప్రత్యేక పర్వదినాలలో గరుడాళ్వార్ సన్నిధిలో  కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ.


ఉగాది ఆస్థానం


మార్చి 19 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మూలవిరాట్ మరియు ఉత్సవమూర్తులకు కొత్త వస్త్రాలు సమర్పిస్తారు సందర్భంగా వేదపండితులు స్వామివారి సన్నిధిలో కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారుఉగాది ఆస్థానం ఉదయం గంటల నుండి 9 గంటల వరకు జరుగుతుంది.


శ్రీరామనవమి ఆస్థానం


మార్చి 27 తేదీన శ్రీరామనవమి సందర్భంగా గరుడాళ్వార్ సన్నిధిలో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారుదీనికి ముందు సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ నిర్వహించబడుతుందిఆస్థానం సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామ జనన ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.


పట్టాభిషేక ఆస్థానం


శ్రీరామనవమి తరువాతి రోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు తిరుమల ఆలయంలో పట్టాభిషేక ఆస్థానం నిర్వహిస్తారు సందర్భంగా వేదపండితులు శ్రీమద్రామాయణంలోని శ్రీరామచంద్రుని పట్టాభిషేక ఘట్టాన్ని స్వామివారి సన్నిధిలో పఠిస్తారు.


No comments :
Write comments