4.4.26

కాళీయమర్దన అలంకారంలో రామచంద్రుని కరుణామృతం kaaleeya mardhanam







ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8 రోజైన శుక్రవారం ఉదయం స్వామివారు కాళీయమర్దన అలంకారంలో భక్తులను కటాక్షించారు.


ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవలో భజన బృందాలు భక్తిరసభరితంగా భజనలుకోలాటాలు నిర్వహించగాస్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను నందింపజేశారు.


వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగు, తేనెచందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకం చేశారు.


రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసూపరింటెండ్ శ్రీ హనుమంతయ్యటెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్‌తో పాటు లువురు అధికారులుఅర్చకులుభక్తులు పాల్గొన్నారు.


ఏప్రిల్ 4 చక్రస్నానం


శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు క్రస్నానం వైభవంగా జరుగనుందిదే రోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.


ఏప్రిల్ 5 పుష్పయాగం


ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

No comments :
Write comments