17.11.17
అలమేలుమంగ హరి అంతరంగ... ఆస్థానమండపంలో భక్తిసాగరంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనలు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, టిటిడి ఉద్యోగి శ్రీసి.బాలసుబ్రమణ్యం కలిసి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి. బ్రహ్మూెత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత న త్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. 'చూడరమ్మ సతులారా....', 'ఏమని పొగడుదమే....', 'క్షీరాబ్ది కన్యకకు....', 'కులుకగ నడవరు....', 'విచ్చేయవమ్మా...' తదితర సంకీర్తనలను టిటిడి అధికారులు రాగభావయుక్తంగా ఆలపించారు.
ఇదిలా ఉండగా ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్.వి.సంగీత కళాశాల అధ్యాపకులతో మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చెన్నైకి చెందిన ఆచార్య సి.నమ్మాళ్వార్ ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి రూపశ్రీ రాజగోపాలన్ బృందం భక్తి సంగీతం, రాత్రి 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో శ్రీమతి కె.శివరత్నం బృందం సంకీర్తనాలాపన చేపట్టారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 7.30 గం||ల వరకు తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.శబరిగిరీష్ బృందం గాత్ర సంగీతం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఇ.నాగసాయి మేఘన బృందం భరతనాట్య కార్యక్రమం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ జి.అభిలాష్ బ ందం భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి వాణిశ్రీ రవిశంకర్ బ ందం న త్య ప్రదర్శన ఇవ్వనున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరువూరుకు చెందిన శ్రీమతి గోధ నాగమణి బృందం భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది.
Devotees had Darshan of Goddess of Wisdom on Hamsa Vahanam
Tiruchanur, 16 November 2017: The devotees were elated by the glimpse of Goddess Padmavathi Devi who graced them as "Saraswathi Devi"-the Goddess of Wisdom on Hamsa Vahanam on second day evening as a part of Navahnika Karthika Brahmotsavams on Thursday.
Saraswati is a Sanskrit fusion word which is a fusion of sāra which means "essence", and sva which means "one self", meaning "essence of one self". Hence Goddess Saraswati is being revered as the "one who leads to essence of self-knowledge".
Universal Mother Padmavathi Devi as the most powerful deity of Wisdom Saraswathi Devi, blessed the devotees in all Her splendor.
TTD EO Sri AK Singhal, Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri A Ravikrishna, Spl.Gr.Dy.EO Sri Muniratnam Reddy were also present.
16.11.17
కపిలతీర్థంలో ముగిసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా పదకొండు రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వస్వామివారి హోమం గురువారం ఘనంగా ముగిసింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రుద్రయాగ సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, కలశాభిషేకం, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు మాసశివరాత్రి సందర్భముగా శివపార్వతుల దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం శ్రీ కాలభైరవస్వామివారి కలశస్థాపన, కలశ ఆరాధన, హోమం, నివేదన, హారతి నిర్వహిస్తారు.
నవంబరు 17వ తేదీ శుక్రవారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం జరుగనుంది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీసుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ
మణిస్వామి, శ్రీస్వామినాథస్వామి, శ్రీవిజయ స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Subscribe to:
Comments
(
Atom
)



























