On the occasion of the 75th birthday of the honourable Chief Minister of Andhra Pradesh, Sri N Chandrababu Naidu, the Head of Bhashyam Educational Institutions, Sri Bhashyam Ramakrishna, donated Rs. 44 lakhs, for one day of Annaprasadam distribution at the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex in Tirumala on Sunday.
On this occasion, TTD Chairman Sri B.R. Naidu, Additional EO Sri Ch Venkaiah Chowdary along with the donor personally served Annaprasadam to the devotees at MTVAC.
The opinions were sought from devotees hailing from Nellore, Guntur, Hyderabad and Kurnool on the taste and quality of the Annaprasadam where all the devotees expressed immense satisfaction.
Deputy EO Sri Rajendra, VGO Sri Surendra, Catering Special Officer Sri Shastry and other officials participated in this program.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75 పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు
The Executive Officer of TTD Sri J Syamala Rao along with Additional EO Sri Ch Venkaiah Chowdary and other officials reviewed on the reorganisation of the Central reception office to reduce congestion and to improve aesthetics as well to provide better waiting facilities to the pilgrims.
The meeting took place at Annamaiah Bhavan in Tirumala on Saturday.
The Central Reception Office (CRO) in Tirumala serves as the primary hub for pilgrims seeking accommodation, darshan tickets, and other essential services.
Over the years, the CRO has experienced significant congestion, especially during peak pilgrimage seasons.
Pilgrims often face challenges such as long queues, limited waiting areas leading to delays and discomfort.
The existing infrastructure, designed decades ago, struggles to accommodate the growing number of devotees visiting the sacred temple town.
In response to these challenges, Dr. G. Karteek, Architect & Urban Designer from the School of Planning and Architecture (SPA), Vijayawada, presented a comprehensive reorganization proposal for the CRO through a PPP.
The presentation showcased an in-depth study and visionary proposal aimed at streamlining pilgrim movement, optimizing space utilization, and improving overall infrastructure in the CRO and PAC-1 area.
The reorganisation proposal integrates traditional spiritual aesthetics with modern urban planning strategies, aligning with the divine significance of the Seven Hills of Tirumala and the ecological setting of the temple town.
The TTD EO discussed in length on the redesigning of the facilities in CRO with dedicated queue line systems and holding areas, spatial zoning and retrofitting of existing buildings, a vision aligned with TTD’s long-term Masterplan and many more.
''The ultimate aim is to avoid the existing congestion and also reorganization of the several decades old buliding, reshaping it as per the needs of the present day and also keeping in view its utility for the next few decades, the EO asserted.
TTD CE Sri Satyanarayana, TTD Town Planning and Urban Designing Expert Sri Ramudu, Tirumala Estates Officer Sri Venkateswarulu, DyEO Sri Harindranath and others were also present.
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కేంద్రీయ విచారణ కార్యాలయంలో మెరుగైన వసతులు కల్పించేందుకు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో కేంద్రీయ విచారణ కార్యాలయం పునర్వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు.
తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం భక్తులకు వసతి, దర్శన టికెట్లు, ఇతర అవసరమైన సేవలను అందించే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. అయితే గత కొంత కాలంగా, ముఖ్యంగా రద్దీ సమయంలో సీఆర్వోకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.
ఈ భవనాన్ని చాలా దశాబ్దాల క్రితం నిర్మించడంతో రోజురోజుకీ పెరిగిపోతున్న భక్తుల సంఖ్యత తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు.
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ డాక్టర్ జి.కార్తీక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించి సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను టీటీడీ అధికారులకు వివరించారు.
ఈ ప్రజెంటేషన్‌లో భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, స్థల వినియోగాన్ని సమర్ధవంతంగా చేసుకోవడం, సిఆర్వో, పీఏసీ-1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేసి పలు ప్రతిపాదనలను వెల్లడించారు.
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక తిరుమల ఏడుకొండల ఆధ్యాత్మిక మహత్యాన్ని, పర్యావరణానికి అనుగుణమైన నగర ప్రణాళికా సూత్రాలను సమన్వయం చేస్తూ రూపొందించబడింది.
ఈ సందర్భంగా ఈఓ శ్రీ శ్యామలరావు మాట్లాడుతూ ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, ప్రస్తుత భవనాల పునరుద్ధరణ వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ ప్రణాళిక టీటీడీ దీర్ఘకాలిక మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా కూడా ఉండాలని సూచించారు.
ప్రస్తుత రద్దీ పరిస్థితులను చక్కదిద్దడం , కొన్ని దశాబ్దాలుగా ఉన్న భవనాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, అలాగే వచ్చే కొన్ని దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశమని ఈఓ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యనారాయణ, టీటీడీ పట్టణ ప్రణాళిక- డిజైన్ నిపుణులు శ్రీ రాముడు, తిరుమల ఎస్టేట్ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, వీ జీవోలు శ్రీరాంకుమార్, శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
As part of the Swachh Andhra–Swachh Tirumala initiative, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary has appealed to the devotees to refrain from throwing garbage from their vehicles onto the roads in the holy pilgrimage town of Tirumala.
The initiative was launched on Saturday morning at the “Kunkala Point” (last step) on the First Ghat Road along Alipiri Footpath, where he administered the Swachh Andhra pledge to the staff and commenced the clean-up drive.
Speaking on the occasion, the Additional EO said that although plastic is officially banned in Tirumala, some pilgrims continue to dispose of plastic covers, food packets, and water bottles on the roadside from the vehicles they have been travelling to.
This has led to a significant accumulation of garbage over the years. As a part of the Swachh Tirumala campaign, the First Ghat Road is now being chosen for a thorough cleanup, he maintained.
He informed that around 400 TTD staff, along with police personnel and Srivari Sevaks and some students who have voluntarily come forward and actively participated in the drive.
In addition to clearing the existing waste, dust bins have been installed along the road to prevent future littering. He urged all devotees to use these dustbins instead of throwing waste from moving vehicles.
He added that over 6,000 TTD staff work continuously to maintain the cleanliness and sanctity of Tirumala.
He requested pilgrims to respect their efforts and the holiness of the place by avoiding littering from their vehicles. All devotees are requested to cooperate and contribute to the success of the Swachh Tirumala Mission.
Later the Additional EO also participated in the debris clearance program all along the down ghat road at eight points along with other officials
TTD CE Sri Satyanarayana, Deputy EO Sri Rajendra, Garden Deputy Director Sri Srinivasulu, Health Officer Sri Madhusudan, VGOs Sri Surendra, Smt. Sadalakshmi, and other officials from TTD and Police were also present.
పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుండి రోడ్లపై చెత్తను విసరడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్ లోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద ఆయన సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తిను బండారాలు, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తున్నారని చెప్పారు. దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగయ్యిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో 400 మంది టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు.
చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్ బిన్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులందరూ ఆ డస్ట్ బిన్ లలో చెత్త వేయాలి తప్పా వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదని అన్నారు.
తిరుమలను పరిశుభ్రంగా ఉంచేందుకు 6వేల మంది సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, వారి కృషిని, తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల నుండి బయటకు చెత్త విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని, స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
అనంతరం ఆయన ఈ సందర్బంగా దిగువ ఘాట్ మార్గంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, వీజీవోలు శ్రీ సురేంద్ర, శ్రీమతి సదాలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులు, పలు శ్రీవారి సేవకులు, విద్యార్థులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
బెంగుళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శనివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి దాత తరఫున విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందజేశారు.