22.4.25

మే 1, 2వ తేదీల‌లో వాచీల‌ ఈ-వేలం




తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, సిటిజ‌న్‌, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్‌, ఇత‌ర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి.

కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయం (వేల‌ములు) 0877-2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.govt.in ను సంప్రదించగలరు.

ఏప్రిల్‌ 23 నుండి మే 3వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం




తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఏప్రిల్‌ 23 నుండి మే 2వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంట‌ల‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జ‌రుగ‌నుంది. మే 1న భోగి తేరు, మే 2న సాత్తుమొర జ‌రుగ‌నుంది. ఆల‌యంలో మే 3న గంధ‌పొడి ఉత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

Sri Govindaraja Swamy Vari Temple Bhashyakarla Utsavam from 23rd to 3rd May




The annual Bhashyakarla Utsavam in Sri Govinda Raja Swamy temple in Tirupati will be observed from April 23 till May 03.


Every day there will be Bangaru Tiruchi procession at 7:30am followed by Chinna Mada Veedhi Utsavam in the evening between 6:30pm and 8pm. Later Pedda Mada Veedhi Utsavam takes place.

On May 02 Sattumora will be observed. The Gandhapodi Utsavam will be celebrated at the temple on May 03.

21.4.25

నారాయణగిరి షెడ్లలో అదనపు ఈవో తణిఖీలు








తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.

క్యూలైన్లలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు‌. భక్తులు ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

TTD Addl Eo Inspections at Narayanagiri Sheds












Due to the increase in the devotee rush to Tirumala following Summer vacation, it is taking around 20 hours to have darshan of Srivaru.


In this context, the TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary conducted surprise inspections at Narayanagiri Sheds on Sunday.

He inspected the arrangements made for the devotees in the queues and made several suggestions to the officials. 

He directed that the devotees should be continuously distributed Annaprasadam and drinking water. 

He advised the officials concerned to utilize the services of Srivari sevaks in accordance with the increasing rush of devotees.

Deputy EOs Sri Rajendra, Sri Harindranath, VGO Sri Surendra and other officials participated in this program.

Devotees with Darshan Tokens and Tickets Shold Arrive Only on the Designated Time - TTD Addl Eo






TTD Additional EO, Sri Ch. Venkayya Chowdary, urged devotees possessing darshan tokens or tickets to arrive at the queue lines strictly on the time slot allotted to them. 


On Sunday night, he inspected the Sarva Darshan queue lines in view of the increased pilgrim rush at Tirumala.

He reviewed the arrangements made for devotees at the TBC and ATC queue complexes and also inspected the food vehicles deployed for the distribution of Annaprasadam in the queue lines and the instructed officials to ensure that the meals are served smoothly without causing inconvenience to the devotees. 

The Additional EO personally gathered feedback from pilgrims regarding the facilities being provided by TTD in the queue lines.

Speaking to the media on the occasion, he noted that due to summer and weekend holidays, the pilgrim crowd has significantly increased at Tirumala. 

He stated that the newly introduced food vehicles are successfully distributing Annaprasadams continuously to the devotees. 

He further said that darshan is being arranged in a well-
co-ordinated manner for devotees holding Sarva Darshan, Special Entry Darshan tickets and Slotted Sarva Darshan tokens.

Deputy EO Sri Rajendra, Vigilance & Security Officer Sri Surendra, Catering Special Officer Sri Shastry, and other officials participated in this inspection.

ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే రావాలి









శ్రీవారి ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే ద‌ర్శ‌న క్యూలైన్ల‌లోకి ప్ర‌వేశించాల‌ని టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి కోరారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో ఆదివారం రాత్రి ఆయ‌న స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు.

టీబీసీ, ఏటీసీ వ‌ద్ద క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు చేసిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా అన్నప్ర‌సాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహిక‌ల్స్ ను ఆయ‌న ప‌రిశీలించి భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా అన్న ప్ర‌సాదాలు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భ‌క్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు,వారంతపు సెలవుల నేపథ్యంలో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు. నూత‌నంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. స‌ర్వ ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా స‌మ‌న్వ‌యంతో ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర‌, వీజీవో శ్రీ సురేంద్ర‌, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.