25.4.25

Octopus Force Mock Drill in Tirumala




A mock drill was conducted by the security forces in Tirumala on Thursday evening. 


In the wake of the Pahalgam terror attack in Kashmir, the mock drill demonstrated how to deal with terrorists infiltration and how to protect devotees. 

A mock drill was conducted at Sudarshan Choultry near Lepakshi Circle under the leadership of the Additional SP Sri Ramakrishna to demonstrate how to repel terrorist attacks in Tirumala.  

Assault Dog, Enemy Attack and Room Intervention activities were demonstrated. In this mock drill by security forces, 28 Octopus commandos, 25 TTD Vigilance sleuths, 15 police and 10 APSP personnel participated and showcased their expertise.

VGOs Sri Ramkumar, Sri Surendra, DSP Sri Vijaya Shekhar, AVSOs and officers from various departments participated in this event.

24.4.25

Gopichand's New Movie under Sri Venkateswara Cine Chitra Production Banner Launched









 

Pushpa Yagam in Sri Kodandarama Swamy Vari Temple




The annual Pushpayagam will be held in Sri Kodanda Ramalayam in Tirupati on May 03 with Ankurarpanam on May 02.


Snapanam will be performed to deities in the morning, while Pushpayagam is from 4pm and 6pm.

The Grihastas can participate on payment of Rs. 1000 per ticket, on which two persons will be allowed.

మే 3న శ్రీ కోదండ రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్పయాగం - మే 2న అంకురార్పణ




తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో మే 3వ తేదీన పుష్పయాగం నిర్వ‌హించ‌నున్నారు. మే 2వ తేదీన సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జ‌రుగ‌నుంది.

మే 3న ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
శ్రీ కోదండరామాలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ భగవద్‌ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు




అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి.

ఈ సంద‌ర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ భగవద్‌ రామానుజాచార్యులపై సాహితీ స‌ద‌స్సు, సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.
ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగ‌ళశాస‌నాల‌తో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం పలువురు ప్రముఖుల ఉపన్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

Sri Ramanujacharya Avatara Mahotsavam from 30th April to 2nd May




TTD is organising a three-day Sri Ramanujacharya Avatara Mahotsavam will be held from April 30 to May 2 under the auspices of TTD Alwar Divya Prabandha Project at Annamacharya Kalamandiram.


As part of the festivities, a literary conference and musical programs on Sri Bhagavad Ramanujacharya will be organised for three days from 6 pm to 8.30 pm.

The Mahotsavam will begin at 5.30 pm on April 30 with the Mangalasasanas of Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy and will be followed by speeches by several dignitaries and devotional music programs.

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం




తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 2న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య అధికారులు పాల్గొన్నారు.