28.4.25

Hit3 Movie Pre-Release Event Stills-01



























 

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం




సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ శ్రీ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ శ్రీ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం


చెన్నై కు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది.

ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సీఎండీ శ్రీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఎం.పి.సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవో ను కోరారు.

మే 01 నుండి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు




వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం

-టిటిడి కీలక నిర్ణయాలు
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి మే 01 తారీకు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది.
వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 01 తారీకు నుండి జూలై 15 వ తారీకు వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది.
అదేవిధంగా మే 01 తారీకు నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది.

VIP Break Darshan Limited To Only Protocol VIPs (Self) from 01st May to 15th July - TTD Key Decisions




With the advent of the summer vacation rush which has already commenced in Tirumala, TTD is set to implement several key decisions from May 01 onwards.

As a part of giving priority to the common devotees coming for Srivari Darshan during the peak summer vacation, TTD has restricted the VIP break darshan only to protocol VIPs (Self) who come for Srivari Darshan from May 01 to July 15.
Similarly, from May 01 onwards, on an experimental basis, the VIP break darshans will be implemented at 6 am for the self-protocol VIPs who come for the Darshan of Sri Venkateswara Swamy.

Sri Sita Mata Jayanti at Vontimitta Sri Kodanda Rama Swamy Vari Temple on 6h May




Sri Kodandarama Swamy Temple at Vontimitta in Kadapa district will observe Sri Sita Jayanti on May 6 under the auspices of TTD.

Key Events Scheduled:
In the morning, the deities will be awakened with Suprabhatam, followed by Tirumanjanam.
Subsequently, Vyasa Abhishekam, Aradhana, and Archana will be performed to the main deities.
In the evening, between 5PM and 6PM, the utsava murthis of Sri Sita, Rama, and Lakshmana will be grandly adorned and placed on a special platform in the Ranga Mandapam.
A special "Vasanthika Puja" for Sri Sita Devi will be conducted with jasmine flowers, amidst chanting of Sahasranama Archana.
Other Important Festivals in May
On May 12, the celestial Sri Sitarama Kalyanam will be held from 9:30 AM to 11:30 AM.
On May 22 following Hanuman Jayanti, at 6AM, Abhishekam and Archana will be performed to Sri Sanjeevaraya Swamy.

ఏప్రిల్ 29న కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం




చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో ఏప్రిల్ 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో మే 5 నుండి 13వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
ఆలయ చరిత్ర :
చిత్తూరు జిల్లా గంగవరం (మం) కీలపట్ల గ్రామంలో వెలసిన శ్రీ కోనేటిరాయ స్వామి దేవాలయం అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధి కలిగిన దేవాలయం. ఈ స్వామి వారిని భృగు మహర్షి ప్రతిష్ట చేసి ఆరాధించగా, పాండవ మధ్యముడు అర్జునుడి ముని మనవడు జనమేజయ మహారాజు గుడి కట్టించారు. తర్వాత కాలంలో చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్యాధీశుల ఏలుబడిలో విశేష పూజలు అందుకుని తర్వాత మహమ్మదీయుల దండయాత్రలకు భయపడి గ్రామస్తులు స్వామి వారిని కోనేటిలో దాచి ఉంచారు. ఆ తర్వాత కాలంలో చంద్రగిరి సంస్థానాధీశుల సామంతులు శ్రీ బోడికొండమ నాయుడు గారికి కలలో సాక్షాత్కరించి కోనేటిలో ఉన్న స్వామివారిని తిరిగి ప్రతిష్టించమని కోరినారు. ఆ విధంగా కోనేటి నుండి ప్రతిష్ట చేయబడి శ్రీ కోనేటి రాయ స్వామిగా ప్రసిద్ధి చెందినారు.
అన్నమయ్య కీర్తనలలో శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయం ఈ గ్రామంలో మాత్రమే ఉన్నది. కోరినదే తడవుగా కొండంత వరములను ప్రసాదించే శ్రీ కోనేటిరాయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.