3.5.25

భక్తి ఉద్యమంతో సంఘాన్ని సంస్కరించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు: శ్రీ కె.ఈ.ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్




భక్తి ఉద్యమంతో సమానత్వాన్ని బోధించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు భగవద్‌ రామానుజాచార్యులని తిరుపతికి చెందిన

శ్రీ కె.ఈ.ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్ పేర్కొన్నారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న రామానుజాచార్యుల అవ‌తార మ‌హోత్స‌వాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి.
ఈ సంద‌ర్భంగా శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌న్ ''రామానుజాచార్యులు - తిరుమ‌ల కైంక‌ర్యాలు '' అనే అంశంపై ప్రసంగిస్తూ, భగవద్‌ రామానుజార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అంశ అని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, దివ్యదేశాలలో ఆయన స్థాపించిన వ్యవస్థ నేటికి కొనసాగుతుందన్నారు.
సాక్షత్తు ఆదిశేషుడే త్రేతా యుగంలో లక్ష్మణుడిగా, కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించి శ్రీవారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న ప్రధమ సేవకుడని తెలిపారు. తిరుమ‌ల ఆల‌య నాలుగు మాడ వీధులు నిర్మించి, స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగే విధంగా ఏర్పాట్లు చేశార‌న్నారు. స్వామివారికి శుక్ర‌వారం అభిషేకం ప్ర‌వేశ‌పెట్టి, శంఖుచ‌క్రాల‌ను ఏర్పాటు చేశార‌ని చెప్పారు. తిరుమ‌ల‌లో జీయ‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి, తానే మొద‌టి జీయ‌ర్‌గా ఉండి శ్రీ‌వారి కైంకర్యాలు చేశార‌ని తెలిపారు. అదేవిధంగా తిరుప‌తిలో శ్రీ గోవింద‌రాజ స్వామివారిని ప్ర‌తిష్టించి, అనేక కైంక‌ర్యాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలియ‌జేశారు.
తిరుమలలో ఆళ్వార్ల‌ పాశురాలు ప్ర‌తి సేవ‌లో ఉండే విధంగా ఒక నియ‌మాన్ని ఏర్పాటు చేశారన్నారు. రామానుజాచార్యుల మేనమామ శ్రీ తిరుమల నంబి తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేశారని, శ్రీ ఆనంతాళ్వారు పుష్ప కైంకర్యాలు నిర్వహించారని వివరించారు. తిరుమల, తిరుపతిపై రామానుజుల ప్రభావం మెండుగా ఉందన్నారు. తిరుమల శ్రీవారికి శ్రీరామానుజాచార్యులు నిర్దేశించిన సేవలను చక్కగా నిర్వహించాలని, ఈ సేవల్లో పాల్గొంటే ఎంతో పుణ్యఫలమని వివ‌రించారు.
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ‌మ‌తి లక్ష్మీ రాజ్యం బృందం గాత్ర సంగీతం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిల, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Sri Ramanuja Charya Was A Social Reformer





The great Sri Vaishnava Saint was a social reformer who brought several changes in the then society and propagated equality, asserted renowned scholar Sri Lakshmi Narasimham.

Addressing the literary fete arranged on the occasion of Sri Bhagavad Ramanujacharya Avatarotsavams held in Annamacharya Kalamandiram on Friday, he spoke on the great works of the famous Sri Vaishna saint.
Alwar Divya Prabandha Project officer Sri Purushottam and others were present.

2.5.25

₹17 Lakh Donation to SV Annaprasadam Trust




Sri Sai Korrapati, renowned film producer and founder of the Vaaraahi Chalana Chitram banner from Hyderabad, donated Rs. 17 lakhs to the SV Annaprasadam Trust on Thursday.


He handed over the demand draft to TTD Additional EO Sri C.H. Venkaiah Chowdary at Annamaiah Bhavan in Tirumala. 

The donor requested that the contribution be utilized to serve lunch to devotees.

Nabha Natesh














 

Addl Eo Inspections in Tirumala






TTD Additional EO Sri Ch Venkaiah Chowdary inspected the coconut sales counter opposite Srivari Temple, TTD publications sales centre, and dollar sales centres on Thursday.


First, inspections were conducted at the coconut sales centre at Akhilandam and the size of the coconuts was examined. 

Later, the Additional EO inspected the TTD publications centre, Sale of incense sticks and Panchagavya also.

Similarly, he inspected the Srivari dollar sales counter in front of Tirumala temple and enquired the details on the sale of dollars.

VGO Sri Surendra was also present.

తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు










శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రం, టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రం, డాలర్ల విక్రయ కేంద్రాలను గురువారం ఉదయం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.

ముందుగా అఖిలాండం వద్ద ఉన్న కొబ్బరికాయలు విక్రయ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి కొబ్బరి కాయల సైజును పరిశీలించారు. కొబ్బరి కాయల విక్రయంపై భక్తుల అభిప్రాయాలను ఆరా తీశారు.
అనంతరం టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి చేరుకున్న అదనపు ఈవో స్టాక్ ను పరిశీలించారు. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు.
అదేవిధంగా టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రానికి చేరుకుని డాలర్ల విక్రయం పరిశీలించారు. అమ్మకాలపై వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వీజీవో శ్రీ సురేంద్ర పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ మ‌ధుర‌క‌వి ఆళ్వార్‌, శ్రీ అనంతాళ్వాన్ అవ‌తార ఉత్స‌వాలు ప్రారంభం




తిరుప‌తి శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ మ‌ధుర‌క‌వి ఆళ్వార్‌, శ్రీ అనంతాళ్వార్ అవ‌తార ఉత్స‌వాలు గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మయ్యాయి. ఈ ఉత్సవాలను మే 10వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మే 10వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు మధురకవి ఆళ్వార్, శ్రీ అనంతాళ్వార్ వారి సన్నిధికి వేంచేసి భక్తులను అనుగ్రహించనున్నారు.
శ్రీ మధురకవి ఆళ్వార్
దక్షిణ భారతదేశంలోని 12 మంది ఆళ్వార్ల‌లో శ్రీ మధురకవి ఆళ్వార్ ఒకరు. ఈయన నమ్మాళ్వార్ శిష్యుడు, పన్నెండు మంది ఆళ్వార్లలో గొప్పవాడిగా పరిగణించబడ్డారు.
శ్రీ అనంతాళ్వార్
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆచార్య పురుషులలో శ్రీ అనంతాళ్వార్ ఒకరు. భగవత్ రామానుజాచార్యుల ఆదేశానుసారం తిరుమలకు వచ్చి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో ఆయ‌న‌ తోటను ఏర్పరచారు.