3.5.25
శాస్త్రోక్తంగా శ్రీ కోదండ రామస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో మే 3న జరుగనున్న పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు.
మే 3న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 గంటలకు నాలుగు మాడ వీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లు భక్తులకు అభయమిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ బి.రవి, సూపరింటెండెంట్ శ్రీ ఎం.మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎ.ఎం.సురేష్ బాబు, గుణశేఖర్ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Ankurarpanam Held
The Ankurarpana for Pushpayagam was held in Sri Kodandarama Swamy temple in Tirupati on Friday evening.
On May 03, the annual Pushpa yagam will be observed from 4pm to 6pm while Snapana Tirumanjanam to the utsava deities will be held in the morning between 11am and 12noon.
Temple DyEO Sri Devendrababu and others were present.
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.
సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Bhashyakara Utsavam Held
Sri Bhashyakarula Sattumora was held in a grand manner at Tirumala Srivari Temple on Friday.
Bhashyakarula Sattumora is held every year in honour of the birth star of the great Sri Vaishnava Saint on the advent of Arudra Nakshatra in the month of Vaisakha.
On this occasion, in the morning, Sri Bhashyakara was taken out on a procession along the four Mada streets of the temple.
After that, Abhishekam was performed in the shrine of Sri Bhashyakara in the footpath route.
After the Sahasra Deepalankara Seva in the evening, Sridevi Bhudevi along with Sri Malayappa Swami on one Tiruchi and Sri Bhashyakara on another Tiruchi were taken on a procession through the streets of the temple.
After that they circumambulate around the Vimana Prakaram of the temple. At night Sattumora will be performed in the Bhashyakara Sannidhi.
Tirumala Sri Sri Peddajeeraswamy, Sri Sri Chinnajeeraswamy and other officials participated in this program.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు జరిగిన భాష్యకార్ల ఉత్సవాలు శుక్రవారం సాత్తుమొరతో ముగిశాయి.
ఇందులో భాగంగా ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం స్వామివారికి తిరుమంజనం, ఆస్థానం, సాత్తుమొర నిర్వహించారు.
భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు.
భగవద్ రామానుజులు దేశమంతటా సంచరించి శ్రీవైష్ణవతత్వాన్ని పరిపుష్టం చేస్తూ ప్రచారం చేశారు. దేశంలోని అనేక శ్రీవైష్ణవక్షేత్రాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి చేయడంతోపాటు ఆలయ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీయర్ మఠం ఏర్పాటుతో పాటు శ్రీవారి ఆలయంలో ఉప ఆలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, పలు నైవేద్యాల సమర్పణ, ఆళ్వార్ దివ్యప్రబంధ పాశురాల పారాయణం, నాలుగు మాడ వీధుల ఏర్పాటు, పూర్ణకుంభ స్వాగతం, ఆచార్య పురుషుల నియామకం వంటి వాటిని శ్రీ రామానుజాచార్యులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.
Subscribe to:
Comments
(
Atom
)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)







