The annual Brahmotsavams of Sri Konetiraya Swamy at Keelapatla, Gangavaram Mandal, Chittoor District, commenced grandly on Monday with the ceremonial Dhwajarohanam.
The ritual was conducted between 12:05 PM and 12:20 PM in Karkataka Lagnam, inviting all deities to the festival.
Special pujas were offered to the Garuda-embossed flag before it was hoisted amidst Vedic chants.
On the first evening, the processional deity will appear on the Pedda Sesha Vahanam.
Special Grade DyEO Smt Varalakshmi, Temple Inspector Sri M. Gajendra, priests, and other officials participated in the event.
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, కరపత్రాలను టీటీడీ జెఈవో శ్రీ వి.వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలో గల జేఈవో కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ మే 11 నుండి 19వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. మే 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 10న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు.
ఆలయ నేపథ్యం:
శ్రీ ఆకాశ మహారాజు నారాయణవనమును కేంద్రంగా చేసుకుని పాలించు చుండెను. వారు సంతానార్థియై పుత్రకామేష్టి యాగము చేయ సంకల్పించి, యాగ స్థలమును స్వర్ణ హలముతో దున్నుతున్న తరుణమున ఒక మందసము నందు పద్మముపై పడుకొన్న చందమున ఒక ఆడ శిశువు లభించింది. ఆ శిశువు పద్మోద్భవిగా తలచి పద్మావతి అను నామ ధేయము చేసి రాజు గారు ఆమెకు విద్యాబుద్ధులు నేర్పి, దిన దిన ప్రవర్థమానురాలుగా చేయసాగెను.
శ్రీ పద్మావతి దేవి యుక్త వయస్సు సమయములో ఒకనాడు తన చెలికత్తెలతో వన విహారము చేయు సందర్భమున వైకుంఠపతియైన శ్రీ శ్రీనివాసుడు వేట మార్గమున వచ్చుచుండగా ఆమెను చూచి, మోహించి, ఆమెని ఆకాశరాజు అనుమతితో సకల దేవతల సమక్షమున విళంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లదశమి, శుక్రవారం వివాహం చేసుకొనెను. వారి జ్ఞాపకార్థం శ్రీ ఆకాశ మహారాజు నారాయణవనమున ఆలయ నిర్మాణం గావించి, వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు జరుపుటకు ఏర్పాటు చేసినారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు అర్చావతారియై, వృక్ష స్థలమున లక్ష్మీదేవి, దశావతార వడ్డ్యాణం, వేట ఖడ్గం, దక్షిణ హస్తమున కల్యాణ కంకణధారియై, నేత్ర దర్శనముతో వేంచేసి యున్నారు.
ఈ ఆలయ ఆకాశరాజు పరిపాలన అనంతరం, కార్వేటినగరం సంస్థానాధీశుల ద్వారా నిర్వహించబడి, తదనంతరం 09-04-1967 సంవత్సరం నుండి టిటిడిలోకి చేర్చబడి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవాలతో విలసిల్లుతున్నది.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
11-05-2025 ధ్వజారోహణం, పెద్దశేష వాహనం.
12-05-2025 చిన్నశేష వాహనం, హంస వాహనం.
13-05-2025 సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం.
14-05-2025 కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం.
15-05-2025 మోహినీ అవతారం, గరుడ వాహనం.
16-05-2025 హనుమంత వాహనం, గజ వాహనం.
17-05-2025 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.
18-05-2025 రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం.
19-05-2025 చక్రస్నానం, ధ్వజావరోహణం.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి ఇతర అధికారులు పాల్గొన్నారు.
The wall posters regarding the annual brahmotsavams in Narayanavanam are released on Monday.
As the big religious fete is scheduled from May 10-19, the posters were released by TTD JEO Sri Veerabrahmam at his chambers in the TTD Administrative building in Tirupati.
DyEO Smt Nagaratna, AEO Sri Ravi Kumar were also present.
Mr. Yatheesh Surineni, Chairman of Suyug Ventures LLP, Bengaluru, has donated Rs. 1.50 crore to the Sri Venkateswara Annaprasadam Trust on Sunday.
He handed over the donation cheque to TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s camp office in Tirumala. On this occasion, the Chairman congratulated and appreciated the donor.
Deputy EO Sri Lokanatham and Peishkar Sri Ramakrishna were also present during the event.
టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
తిరుమలలోని కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుండి 2025 మే 1వ తేదీ వరకు 26,214 వివాహాలు అయ్యాయి. ఇందులో భాగంగా పురోహితుడు, మంగళవాయిద్యంతోపాటు పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టిటిడి ఉచితంగా అందిస్తుంది.
వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.
వివాహాం అనంతరం రూ.300/-ల ప్రత్యేక ప్రవేశం ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ వద్ద గల క్యూలైన్ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 మంది 6 లడ్డూలను లడ్డూ కౌంటర్లు నందు పొందాలి.
కల్యాణ వేదికకు ఆన్లైన్లోనే బుకింగ్ అవకాశం
తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్లైన్లో కల్యాణవేదిక స్లాట్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.
వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి. వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఆధార్ కార్డులను అప్లోడ్ చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్క్లిస్ట్ / ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ కార్యదర్శి/ మునిసిపల్ అధికారుల నుండి బర్త్ సర్టిఫికేట్ ను జత చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.
కరెంటు బుకింగ్ / ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు. ఇతర వివరాలకు ఫోన్ - 0877 - 2263433 సంప్రదించవచ్చు.
వివాహ రిజిస్ట్రేషన్ కొరకు
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, తమ వివాహన్ని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ''హిందూ వివాహ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయము''ను కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం నూతన వదూవరులు తమ వయస్సు ధృవ పత్రములు, నివాస ధృవ పత్రము, వివాహము ఫోటో, పెండ్లి పత్రిక, కళ్యాణ మండపము రసీదు పత్రాలను, వీటితో పాటు అవివాహితులుగా (అన్ మ్యారీడ్) ఉన్నట్లు స్థానిక ఎమ్మార్వో నుండి ధృవీకరణ పత్రాలను కల్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి.
ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ - 0877 - 2263433 సంప్రదించవచ్చు.
తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.