శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా బుగ్గోత్సవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
The Bugga Utsavam at Sri Govindaraja Swamy Temple in Tirupati was observed on Friday. The three-day festival began with special events on the first day.
తిరుమల శ్రీవారి ఆలయంలో మే 11న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు.
Narasimha Jayanti will be observed in Tirumala on May 11, in the advent of the Swati Nakshatram in the month of Vaisakha.
The annual Tepotsavams at Sri Lakshmi Venkateswara Swamy Temple in Devuni Kadapa will be held from May 10 to 12.
వైఎస్సార్ కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆలయ పుష్కరిణిలో మూడు రోజుల పాటు సాయంత్రం వేళ తెప్పలపై విహరించనున్నారు. స్వామి, అమ్మవారు మొదటి రోజు మూడు చుట్లు, రెండో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడు చుట్లు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 617వ జయంతి ఉత్సవాలు మే 12 నుండి 18వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగనున్నాయి.