12.5.25
టీటీడీ స్థానికాలయాల్లో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీకి చెందిన పలు స్థానిక ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో...
నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం తో అభిషేకం చేశారు.
రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో...
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టం జరిగింది. ముందుగా ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, వాసుదేవ పుణ్యాహవాచనం, నవకలశ ఆరాధన, ధ్వజస్థంభానికి అభిషేకం నిర్వహించారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు ఆలయంలో వాహన సేవలు నిర్వహిస్తారు.
న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో...
న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 నుండి 8.07 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
రిషికేష్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో...
ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం 10.50 నుండి 11.15 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Dhwajarohanam Marks Comemncement of Annual Fete in TTD Temples
The annual brahmotsavams in a few TTD run temples across the country have commenced on Sunday with Dhwajarohanam.
The celestial Garuda flag was hoisted at Rishikesh, New Delhi SV temples besides Narayanavanam and Jammalamadugu temples with utmost devotion.
Respective temple officials and devotees participated.
11.5.25
దేవుని కడపలో కన్నుల పండువగా ప్రారంభమైన తెప్పోత్సవాలు
వైఎస్సార్ కడపజిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు ఆలయ ఆవరణలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీకృష్ణుడు, గోదాదేవి ఉత్సవమూర్తులను కోలువుతీర్చి తులసి, పుష్పమాలలతో అలంకరించి పాలు, తోనె, కొబ్బరి నీరు పసుపు, గంధం, సుగంధం, పరిమళంతో సహస్రధారాభిషేకం చేశారు. అనంతరం ధూప దీప నివేదన, కర్పూర హారతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం సాయంత్రం ప్రత్యేక తిరుచ్చిపై శ్రీకృష్ణుడు, గోదాదేవి ఉత్సవమూర్తులను కోలువుదీర్చి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి పుష్కరిణి వరకు ఉరేగింపుగా తీసుకొచ్చారు. పుష్కరిణిలో తెప్పపై శ్రీకృష్ణుడు, గోదాదేవిని కొలువుదీర్చి బంగారు అభరణాలు, పుష్ప మాలలతో అలంకరించి వేద పారాయణం, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత కచేరి, హరికథాగానం, కోలాటాలు భక్తులను విశేషంగా అలరించాయి.
కాగా, పుష్కరిణిలో మే 11న ఐదు చుట్లు, మే 12 ఏడు చుట్లు విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి అధికారులు, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
Teppotsavam Commences at Devuni Kadapa
The Teppotsavam at Sri Lakshmi Venkateswara Swamy Temple in Devuni Kadapa began on Saturday evening.
The Utsava deities of Sri Venkateswara Swamy and Sridevi, and Bhudevi were taken on a beautifully decorated float for three rounds around the temple pushkarini, blessing the devotees.
The float procession will continue on May 11 with five and seven rounds on May 12. In addition, cultural programs including bhakti sangeet, Harikatha, and Kolatam dances will be held.
Subscribe to:
Comments
(
Atom
)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)






.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)



