21.5.25

Hari Hara Veera Mallu Movie Press meet-01






























 

Aakanksha Singh




























 

వైఖానస ఆగమ సలహా కమిటీ నియామకం




గ‌త మార్చి నెల‌లో జ‌రిగిన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు టీటీడీ ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, కొత్త కమిటీని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎ.ఎస్.శ్రీ కృష్ణ శేషాచలం దీక్షితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలోని వైఖానస ఆగమ విభాగం అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ డా.పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన శ్రీ పీ.కే.వరదన్ భట్టాచార్యార్, శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయంలోని సంభావ‌న‌ అర్చకులు శ్రీ ఏ.అనంతశ‌యన దీక్షితులు, మాజీ అర్చకులు శ్రీ ఏ.ఖద్రీ నరసింహాచార్యుల‌ను నూత‌న ఆగ‌మ స‌ల‌హా క‌మిటీలో స‌భ్యులుగా నియ‌మించ‌డం జ‌రిగింది. వీరి ప‌ద‌వీకాలం రెండేళ్ల పాటు కొన‌సాగ‌నుంది.

Appointment of Vaikanasa Agama Advisory Committee




As per the decision taken during the TTD Trust Board meeting held in March this year, the existing Vaikhanasa Agama Advisory Committee has been dissolved, and a new committee has been appointed. 


The new Vaikhanasa Agama Advisory Committee comprises five members including Sri A.S. Sri Krishna Seshachalam Deekshitulu, Chief Priest of Sri Vari Temple, Dr. Parasharam Bhavanarayana Acharyulu, Assistant Professor, Department of Vaikhanasa Agama, SV Vedic University, Sri P.K. Varadhan Bhattacharyar from Chennai, Sri A. Ananthashayana Deekshitulu, Honorary Priest at Sri Govindaraja Swamy Temple, Sri A. Khadri Narasimhacharyulu, Former Priest.

The tenure of this new committee will be for a period of two years.

మే 22న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు




ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 22వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది.

శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనుంది.
తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది.
ఈ సంద‌ర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ త‌ర‌పున శ్రీ జ‌పాలి హ‌నుమాన్ కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు.
కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ భక్తులు, స్థానికుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి కూడా కల్పిస్తున్నది.

Hanuman Jayanthi on 22nd May




In connection with Hanuman Jayanti on May 22 TTD will present silk vastrams to Japali Hanuman in Tirumala.


It is a traditional practice to offer Pattu Vastrams to Sri Japali Hanuman every year on behalf of TTD during the auspicious occasion of Hanuman Jayanti.

Besides special pujas will also be observed to Sri Bedi Anjaneya Swamy and 7th Mile Prasanna Anjaneya Swamy in Down Ghat road on that day.

తిరుమ‌లకొండ‌పై ప‌చ్చ‌ద‌నాన్ని మ‌రింత పెంచుతాం: టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు








తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం ఉద‌యం టీటీటీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌ర‌గింది. టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన స‌మావేశంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. ఈ వివ‌రాల‌ను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు మీడియాకు వివ‌రించారు.

టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం ముఖ్య నిర్ణ‌యాలు
•⁠ ⁠రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్నిఅట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యం. ప్ర‌భుత్వ ఆమోదం వ‌చ్చాక ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యం.
•⁠ ⁠తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర బృహ‌త్ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యం.
•⁠ ⁠తిరుమ‌ల‌లోని విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్ద‌రు దాత‌లు స్పందించ‌లేదు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను టీటీడీనే మార్పు చేయాల‌ని నిర్ణ‌యం. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాం.
•⁠ ⁠తిరుమ‌ల‌లోని బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణ‌యించే అంశంపై ఆమోదం. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం.
•⁠ ⁠ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భ‌క్తులు విశేష సంఖ్య‌లో సంద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఇక్క‌డ‌ ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత పెంచేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యం.
•⁠ ⁠రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా ఉంటూ ఎంద‌రో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి ఆర్థిక స‌హాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం. స్విమ్స్ మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించేంద‌కు ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టేందుకు నిర్ణ‌యం. అదేవిధంగా 85శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భ‌వంతుల‌ను (ఆంకాల‌జీ మ‌రియు ప‌ద్మావ‌తి చిన్ని పిల్ల‌ల ఆసుప‌త్రిల‌తో క‌లిపి) త్వ‌ర‌లోనే మిగిలిన ప‌నుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణ‌యం. శ్రీ‌వారి వైద్య సేవ‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యం.
•⁠ ⁠టీటీడీలో ప‌ని చేస్తున్న అన్య‌మ‌త‌స్తులను బ‌దిలీ చేసేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు, స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆమోదం.
•⁠ ⁠తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యం. దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆధికారుల‌కు ఆదేశం.
•⁠ ⁠ఒంటిమిట్ట‌లో భ‌క్తుల‌కు అన్న‌దానం సేవ‌ల‌ను మరింత పెంచాల‌ని నిర్ణ‌యం.
•⁠ ⁠తుళ్లూరు మండ‌లం అనంత‌వ‌రంలోని టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదం.
•⁠ ⁠శ్రీ‌వారి నామావళిని రీమిక్స్ చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించిన‌ డీడీ నెక్ట్స్ లెవ‌ల్ చిత్రబృందంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం.