8.6.25

Kannappa Movie Pre-Release Event Held at Guntur of AP-01
























 

Grand Mommencement of Sri Padmavathi Ammavari Teppotsvams





The annual Teppotsavam of Sri Padmavathi Ammavaru at Tiruchanur commenced in a ceremonious manner on Saturday. 


On the first day, Sri Krishnaswamy, accompanied by Sri Rukmini and Sri Satyabhama, blessed devotees while taking three rounds on the finely decorated float in the sacred Padmasarovaram.

As part of the festivities, the day began with Suprabhata Seva, followed by Sahasranamarchana and Nityaarchana to the processional deity of Sri Padmavati Devi.

From 3 PM to 4.30 PM, a special Abhishekam was performed to Sri Krishnaswamy in the Mukha Mandapam, using milk, curd, honey, sandal paste, and other aromatic substances.

At 6.30 PM, the Utsava deities were brought to the Sacred Padma Pushkarini. 

The Teppotsavam was held from 6.30 PM to 7.15 PM in a devotional manner.

Temple Deputy EO Sri Harindranath, Superintendent Sri Ramesh, other officials, priests, and a large number of devotees were also present.

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ప్రారంభం Float Festival








తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మసరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 03.00 నుండి 4.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ కృష్ణస్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ కృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు Prasanna Venkateswara Swamy vari Brahmotsavams








అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 8.00 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
టిటిడి పటిష్ట ఏర్పాట్లు:
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు. ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది.
అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు.
సాయంత్రం 5.30 నుండి రాత్రి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహన సేవ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.
భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున పుష్పాలంకరణలు :
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు రూపొందించారు. భ‌క్తుల‌కు వేస‌విలో ఇబ్బంది లేకుండా చ‌లువ పందిళ్లు, తాగునీరు, మ‌జ్జిగ‌, అన్న‌ప్ర‌సాదాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్ర‌థ‌మ చికిత్స‌ కేంద్రం, ఆయుర్వేద వైద్య‌శాల త‌దిత‌ర కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవ రాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టింపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఏవీఎస్వో శ్రీ సతీష్ కుమార్ ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, శ్రీ‌వారి సేవ‌కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరిలో దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం sri vari mettu









తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గాన కాలినడకన వెళ్లే భక్తులకు శుక్రవారం సాయంత్రం నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో 

దివ్యదర్శనం టోకెన్ల జారీని టిటిడి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు మార్చడంపై భక్తుల నుండి స్పందన అపారమని అన్నారు.
శ్రీనివాస మంగాపురం ఆలయంలో కౌంటర్లను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI) అనుమతి రావాల్సి ఉందన్నారు.
ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో భక్తుల సౌకర్యార్థం టోకెన్ కౌంటర్లను తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చామన్నారు. భూదేవి కాంప్లెక్స్ లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఎస్ ఎస్ డి టోకెన్లను జారీ చేసే మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఒకే చోట చాలా కాలంగా ఉండడం వల్ల ఇక్కడ నుండి జారీ చేస్తున్నామన్నారు.
శ్రీవారి మెట్టు డీడీ టోకెన్లను జారీ చేయడానికి నాలుగు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని, టీటీడీ ఏర్పాట్లపై భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
రవాణా వ్యవస్థ కూడా బాగా ఉందని, బస్ స్టాండ్ కూడా అలిపిరిలోనే ఉందన్నారు. కాబట్టి భక్తులు శ్రీవారి మెట్టు చేరుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు.
భక్తులకు సేవలు అందించడానికి శ్రీవారి సేవా వాలంటీర్లతో పాటు పరిపాలనా, నిఘా, అదనపు పారిశుధ్య సిబ్బందిని నియమించామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా డీడీ టోకెన్లను జారీ చేయడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం, సీవీ&ఎస్ఓ శ్రీ కె.వి. మురళీకృష్ణ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Govindaraja Gets Presents from Venkatesa




As a part of the ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati on Friday evening, Garuda Seva will be observed.


It is a tradition to offer presents on behalf of Tirumala Venkateswara Swamy to Sri Govindaraja Swamy every year on this auspicious day.

This year the Hill deity gifted Rs.34.46lakh worth of jewels to Sri Govindaraja which includes three dollars(bearing the images of deities).

In a procession, the jewels reached the temple amidst the colourful paraphernalia and dance troupes.

FACAO Sri Balaji, DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy and other temple staff, devotees were also present.

Pedda Sesha Vahanam on Day One Annual Fete







Pedda Sesha Vahana Seva on the first evening of the ongoing annual brahmotsavams at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta on Saturday.


The Utsava deities of Sri Prasanna Venkateswara along with Sridevi and Bhudevi were taken for a celestial ride along the four mada streets encircling the temple.

The devotees are thrilled to witness the deities on the giant seven-hooded divine serpent carrier.

DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani and others were present.