12.6.25

Nabha Natesh







 

Jyestabhishekam Concludes in Srivari Temple








The three-day sacred Festival of Jyestabhisekam concludes on a grand note at the Srivari temple on Wednesday morning as Sri Malayappaswamy and his consorts were re-draped once again in gold kavacham.


Earlier after Maha Shanti homam at the Kalyana Mandapam in the Sampangi Prakaram, the utsava idols were given snapana thirumanjanam before adorning them in gold kavacham.

Later in the evening, the utsava idols were taken around in procession in the mada streets to bless the devotees. The TTD cancelled arjita sevas like the Kalyanotsavam, unjal seva, arjita Brahmotsavams to facilitate the Jyestabhisekam rituals.

Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD Board Member Smt Suchitra Ella, Addl EO Sri C.H. Venkaiah Chowdary, Peishkar Sri Rama Krishna and Others Participated.

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు




















వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్‌ దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, పేష్కార్ శ్రీ రామకృష్ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ












తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టిటిడి ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది.

వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజులలో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు. రూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టిటిడి కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టిటిడి అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.
దాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ - 2, పీఏసీ - 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్‌, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్‌, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు.
ప్రతి రోజూ టిటిడిలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుండి టిటిడి అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది. 

వైభవంగా ఒంటిమిట్ట శ్రీసీతారాముల కళ్యాణోత్సవం





తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జ్యేష్ట మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.

ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యా వచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, అక్షతరూపణ మాల మార్పిడి, వారణమయి మహా నివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని చూశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

పల్లకీలో మోహినీ అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు






అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గం.లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు పల్లకీలో మోహినీ అవతారోత్సవంలో భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 - 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9.30 - 11 గం.ల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 - 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ జరుగనుంది .
బుధవారం రాత్రి 7.30 గం.లకు గరుడ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Grand Celebratin of Sri Sitarama Kalyanotsavam at Vontimitta




Sri Sitarama Kalyanotsavam was observed with grandeur on Wednesday at the Sri Kodanda Rama Swamy temple in Vontimitta, Kadapa district, an affiliated temple under the Tirumala Tirupati Devastanams, marking the auspicious occasion of Jyestha Pournami.


The festival deities of Sri Sita and Sri Rama were elegantly adorned with golden ornaments and colourful flowers and seated on a specially decorated platform within the temple premises.

The temple priests performed various traditional rituals, including Vishwaksena Puja, Kalasha Sthapana, Kalasha Puja, Vasudeva Punyavachanam, Kankana Puja and Dharana, Yajnopavita Puja and Dharana, offering of silk clothes and Madhuparkam, Kanyadanam, Mangala Puja, Mangalyadharana, exchange of garlands, Varanamayiram, Maha Nivedana, and Karpoora Harati.

Devotees from the surrounding areas of Ontimitta gathered to witness the divine celestial wedding and had darshan of the deities. They also received Theertha and Prasadam. TTD officials and devotees actively participated in the event.