25.9.25

Gold Yagnopaveetam Donated




Visakhapatnam-based Hindustan Enterprise MD Shi Puvvada Mastan Rao and Smt. Kumkuma Rekha donated a gold Yagnopaveetam(sacred golden multi-layered thread) worth Rs. 3.86 crore to Srivaru on Wednesday.


This gold Yagnopaveetam is specially crafted with diamonds weighing around 3.86kg. 

To this extent, the donors handed over this donation to TTD Chairman Sri B.R. Naidu garu at the Ranganayakula Mandapam of Srivari Temple.

On this occasion, the Chairman congratulated the donors for their largesse and presented Srivari Theertha Prasadams.

TTD Board Members Smt. Panabaka Lakshmi, Sri Bhanu Prakash Reddy, Sri Naresh Kumar, Sri Shantaram and others participated in the event.

శ్రీవారికి రూ.3.86 కోట్లు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం విరాళం gold yagnopaveetam




తిరుమల శ్రీవారికి విశాఖపట్నం చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజ్ ఎండీ శ్రీ పువ్వాడ మస్తాన్ రావు, శ్రీమతి కుంకుమ రేఖ దంపతులు రూ.3.86 కోట్లు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతంను బుధవారం విరాళంగా అందజేశారు.

వజ్రాలతో పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం 3.860 కేజీల బంగారంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దబడింది. 
ఈ మేరకు దాతలు ఈ కానుకను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు గారికి అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ దాతలను అభినందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ నరేష్ కుమార్, శ్రీ శాంతారామ్ తదితరులు పాల్గొన్నారు.

24.9.25

Discharge Duties with more Commitment - TTD Addl Eo




The TTD Additional EO Sri Ch Venkaiah Chowdary called on all the deputation officers and employees for annual Brahmotsavams to discharge duties with more commitment.


During the orientation program held for deputed staff held at Astana Mandapam in Tirumala on Tuesday evening, the Additional EO advised the deputed staff to work in coordination with already working staff in the respective places and extend their support in executing the assigned activities in a smooth manner.
 
He said this year the annual brahmotsavams has been planned in a meticulous manner and besides SoPs, proper check lists have also been prepared to get proper feedback from devotees.

JEO Sri Veerabrahmam, CVSO Sri Muralikrishna, and other officers, deputed staff were also present.

భక్తి, నిబద్ధతతో విధులు నిర్వర్తించండి బ్రహ్మోత్సవ సిబ్బందితో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ttd addl eo




వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన డిప్యూటేషన్ అధికారులు, సిబ్బంది మరింత భక్తి, నిబద్ధతతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు.

మంగళవారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో డిప్యూటేషన్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత ప్రాంతాల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుని, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.
ఈసారి బ్రహ్మోత్సవాలను ఎంతో సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించామని, నిర్ధిష్ట విధివిధానాలతో పాటు చెక్‌లిస్ట్‌లను కూడా సిద్ధం చేశామని, తద్వారా భక్తుల నుండి సరైన ఫీడ్‌బ్యాక్ పొందేందుకు వీలుకలుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Ornament Donated






Telangana MP Sri Konda Visweswar Reddy donated an Ashta Lakshmi Chandra Vanka ornament weighing 535 grams and worth Rs. 60 lakhs to Sri Venkateswara of Tirumala on Tuesday.


He presented the ornament at the Ranganayakula Mandapam inside the temple to TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary.

Postponement of the Release of SED Tickets




The release of Rs.300 Special Entry Darshan and SRIVANI Break Darshan tickets for 29, 30 and 31st December-2025 (Vaikunta Dwara Darshanam) will not be released along with  December-2025 online quota due to administrative reasons.


A revised schedule for the release of these tickets will be announced separately in due course.

శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం astalakshmi ornament





తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు.

ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు.