2.5.26

ధ్వజారోహణంతో జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం jammala madutu temple




జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.


ఇందులో భాగంగా ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలనుముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.


సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల‌సేవ‌రాత్రి 7 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌న సేవ జ‌రుగ‌నున్నాయి.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ప్ర‌శాంతిసూపరింటెండెంట్ శ్రీ హ‌నుమంత‌య్య‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సునీల్‌ఆలయ అర్చకులుఇతర అధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.  

New Delhi Sri Venkateswara Swamy Vari Temple Brahmotsavams Begins


The annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, New Delhi, commenced on Friday morning with Dhwajarohanam.


The flag hoisting was performed between 9 am and 10.30 am in Mithuna Lagnam, inviting all celestial beings to the festival. Special pooja was offered to the Garuda flag before hoisting it on the temple mast.

Pedda Sesha Vahana Seva will be held at 7.30 pm.


Local Advisory Committee Chairman Sri Sumanth Reddy, AEO Sri Balaraju, temple staff, priests, and devotees participated.

ధ్వజారోహణంతో న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం new delhi temple


న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయిరాత్రి 7.30 గంటలకు స్వామివారు పెద్ద‌శేష‌వాహనంపై విహ‌రించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మిథున‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారుసకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలనుముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.


ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారుఅనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించిపూజలు చేసిధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.


 కార్యక్రమంలో న్యూ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ సుమంత్ రెడ్డిఆలయ ఏఈవో శ్రీ బాల‌రాజుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రంగనాయక్శ్రీ ఉదయ్ కుమార్ఆలయ అర్చకులుఇతర ధికారులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.  


Hanuman Jayanti on12th May




In connection with Hanuman Jayanti on May 12 TTD will present silk vastrams to Japali Hanuman in Tirumala.


It is a traditional practice to offer Pattu Vastrams to Sri Japali Hanuman every year on behalf of TTD during the auspicious occasion of Hanuman Jayanti.


Besides special pujas will also be observed to Sri Bedi Anjaneya Swamy and 7th Mile Prasanna Anjaneya Swamy in Down Ghat road on that day.


TTD has also arranged free bus to transport to seventh mile and back to Tirumala on that day for the benefit of devotees and locals.

మే 12న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు hanuman jayanti


ప్రతి సంవత్సరం వైశా మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు  ఏడాది మే 12 తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది.


శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.


తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడుతుంది.


 సంద‌ర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ త‌ర‌పున శ్రీ జ‌పాలి హ‌నుమాన్ కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు.


కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులుస్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకుతిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.


Admissions Open for 2026-27 at Sri Venkateswara Sculpture College


Applications are invited from May 04 to June 20 for Diploma (4 years) and Certificate (2 years) courses at TTD-run Sri Venkateswara Traditional Temple Architecture & Sculpture College, Tirupati.


Eligible 10th-pass candidates can apply. Selected students will receive free accommodation, food, and a ₹1 lakh bank deposit by TTD after course completion.


The institute, established in 1960, is the only traditional temple architecture training centre in Andhra Pradesh, offering strong career opportunities in temple construction, archaeology, and tourism sectors.


Applications can be obtained at the college or downloaded from www.tirumala.org.

శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో 2026–27 అడ్మిషన్లు ప్రారంభం


సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూభవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు విశిష్ట సేవలందిస్తోంది క్రమంలోతిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.


సంవత్సరాల డిప్లొమా కోర్సు మరియు 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 04 తేదీ నుంచి జూన్ 20 తేదీ వరకు దరఖాస్తులను జారీ చేసిస్వీకరించనున్నారుపదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చుఅభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టిటిడి వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20 తేదీ  సాయంత్రం లోపు అందజేయాలి. 


ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసికోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది.


శిల్పకళాశాల విశిష్టత


1960లో స్థాపించబడిన  శిల్పశిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏకైకంగా నిలిచిభారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణంవాస్తుశిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోందిభారతీయ సంస్కృతివారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోంది.


కోర్సుల వివరాలు

డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ (4 సంవత్సరాలు)


రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు ఏఐసిటిఈ అనుమతితో నిర్వహించే  కోర్సులో 6 విభాగాలు ఉన్నాయి:


ఆలయ నిర్మాణం

శిలా శిల్పం

సుధా శిల్పం

లోహ శిల్పం

కొయ్య శిల్పం

సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం


ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పునమొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారువిద్యార్థులకు ఉచిత వసతిభోజన సౌకర్యం అందుబాటులో ఉంటుందిచివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.


సంప్రదాయ కలంకారి కళ (2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు)


వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే  కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారుఉచిత వసతిభోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయిదేశ విదేశాల్లో లంకారి కళకు మంచి డిమాండ్ ఉంది.


ప్రవేశ విధానం


రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందిఅర్హులైన అభ్యర్థులు మే 04 నుండి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఉపాధి అవకాశాలు


 సంస్థలో శిక్షణ పొందిన వారు టిటిడి ఆలయ నిర్మాణపునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులుటెక్నికల్ అసిస్టెంట్లుకాంట్రాక్టర్లు దేవాదాయపర్యాటకపురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.  అంతేకాకజాతీయ స్థాయిలో నేక అవార్డులు అందుకుంటున్నారు.


ఇతర వివరాలకు


శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ

తిరుమల తిరుపతి దేవస్థానములులిపిరి రోడ్తిరుపతి – 517507

వెబ్‌సైట్www.tirumala.org

ఫోన్: 0877-2264637