13.5.26

తిరుమ‌ల‌లో ఘనంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు hanuimath jayanti







హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల మొద‌టి ఘాట్ రోడ్డులోని 7 మైలు వద్ ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్ర‌హం వ‌ద్ద వే మంత్రోచ్చారణలు మేళ‌తాళాల నడు టీటీడీ ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భ‌క్తుల‌కు ప్రసాదాలు పంపిణీ చేశారు.


కార్యక్రమంలో అదనపు ఈఓ శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


అదేవిధంగా తిరుమ‌ల‌లో స్థానికంగా ఉన్న ప‌లు హ‌నుమాన్ ఆల‌యాల్లో కూడా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.

టీటీడీకి రూ.1.03 కోట్లు విరాళం donation


ముంబైకు చెందిన శ్రీ విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు మంగళవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

12.5.26

Chiranjeevi








 

HANUMAN JAYANTHI CELEBRATIONS IN TTD LOCAL TEMPLES ON MAY 12


Uploaded Image

TTD will celebrate Hanuman Jayanthi grandly on May 12 in local temples including Sri Kodandarama Swamy Temple, Sri Govindaraja Swamy Temple, Sri Prasanna Venkateswara Swamy Temple and Sri Kodandarama Swamy Temple along with other affiliated temples.


Special pujas, abhishekams and Hanumantha Vahana Sevas will be conducted on the occasion.


At Tirupati and Ontimitta Sri Kodandarama Swamy temples, special abhishekams will be held from 7 am to 9 am, followed by Hanumantha Vahana Seva from 7 pm to 8.30 pm.


Special abhishekams will also be performed at Edduru Anjaneya Swamy Temple near Sri Govindaraja Swamy Temple and at Appalayagunta temple.


TTD appealed to devotees to participate in large numbers and seek the blessings of Sri Anjaneya Swamy.

మే 12న టీటీడీ స్థానిక ఆలయాల్లో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు hanumat jayanti




ప్రత్యేక అభిషేకాలు – భక్తిశ్రద్ధలతో హనుమంత వాహనసేవలు


తిరుపతి, 2026 మే 11: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మే 12 హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.


శరణాగత భక్తికిఅచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలుఅభిషేకాలువాహనసేవలు నిర్వహించనున్నారు.


తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో


తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు.


ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకుశ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారురాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.


శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో


తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.


అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.


ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో


ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.


 సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సంజీవరాయస్వామివారి మూలవర్లకుశ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారురాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనుంది.


భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది


మే 23 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు


కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే 22 తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.


భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.


వాహనసేవల విశేషాలు


మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం

ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.


మే 24 – చిన్నశేష, హంస వాహనాలు

ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హం వాహనంపై స్వామివారు విహరించనున్నారు.


మే 25 – సింహ, ముత్యపుపందిరి వాహనాలు

ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి.


మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు

ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి ర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.


మే 27 – మోహినీ అవతారం, గరుడసేవ

ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించనుండగా, రాత్రి జరిగే గరుడవాహనసేవ బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.


మే 28 – హనుమంత, గజ వాహనాలు

ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనసేవలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తనున్నాయి.


మే 29 – సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు

ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.


మే 30 – రథోత్సవం, అశ్వవాహనం

ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా రుగనుండగా, రాత్రి అశ్వవాహనసేవ నిర్వహించనున్నారు.


మే 31 – చక్రస్నానం, ధ్వజావరోహణం

ఉదయం చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.


సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


మే 18 కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18 తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమమైన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.


సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను పవిత్రజలాలతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.


KOIL ALWAR TIRUMANJANAM ON MAY 18

 


The annual Brahmotsavams of Sri Govindaraja Swamy Temple will be observed from May 23 to 31 in a grand manner. The festivities will commence with Ankurarpanam on the evening of May 22.


During the nine-day festival, the deity will bless devotees on various Vahanams through the temple Mada streets amidst Govinda namasmarana. Vahana Sevas will be held daily from 7 am to 9 am and 7 pm to 9 pm.


Major events include Garuda Seva on May 27, Rathotsavam on May 30, and Chakrasnanam with Dhwajavarohanam on May 31.


As part of the festivities, spiritual, devotional and cultural programmes will also be organised daily under the auspices of TTD Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project.


Koil Alwar Thirumanjanam will be conducted in the temple on May 18 from 7 am to 9 am as part of the pre-Brahmotsavam cleansing ritual. The temple premises and puja materials will be ceremonially purified with sacred ingredients and aromatic substances before allowing devotees for darshan.