15.5.26

మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు brahmotsavams





పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య క్షేత్రమైన నారాయణవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 5 తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మే 27 సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడనున్నారు.


ఆకాశరాజు నిర్మించిన పుణ్యక్షేత్రం


శ్రీ పద్మావతీ దేవి అవతరించిన విత్ర స్థలంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. శ్రీ ఆకాశరాజు పుత్రకామేష్టి యాగ సమయంలో స్వర్ణహలంతో భూమిని దున్నుతుండగా పద్మంపై వెలసిన దివ్య శిశువును కనుగొనిపద్మావతిఅని నామకరణం చేశారు. అనంతరం శ్రీనివాసుడు వేటకు విచ్చేసిన సందర్భంలో పద్మావతీదేవిని దర్శించి, ఆకాశరాజు నుమతితో సకల దేవతల సమక్షంలో వివాహం జరిగింది. దివ్య కల్యాణ ఘట్టానికి చిరస్మరణగా ఆకాశరాజు నారాయణవనంలో ఆలయాన్ని నిర్మించారు.


స్వామివారి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండగా, ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవార్ల సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే శ్రీ కోదండరామస్వామి, శ్రీ రంగనాథస్వామి, శ్రీ రాజమన్నార్‌స్వామి ఉపాలయాలు క్షేత్ర మహిమను మరింత పెంచుతున్నాయి.


మే 24 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో మే 24 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర ద్రావణాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు.


బ్రహ్మోత్సవాల వాహనసేవలు


బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలపై స్వామి, అమ్మవారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.


మే 28 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం

మే 29 – చిన్నశేష వాహనం, హంస వాహనం

మే 30 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం

మే 31 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం

జూన్ 1 – మోహినీ అవతారం, గరుడ వాహనం

జూన్ 2 – హనుమంత వాహనం, గజ వాహనం

జూన్ 3 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం

జూన్ 4 – రథోత్సవం, అశ్వవాహనం, కల్యాణోత్సవం

జూన్ 5 – చక్రస్నానం, ధ్వజావరోహణం

జూన్ 4 స్వామివారి కల్యాణోత్సవం


జూన్ 4 తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రూ.1000/- టికెట్‌తో గృహస్తులు పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమను ప్రసాదంగా అందజేయనున్నారు.


ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు


బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరింది.


E-Auction of Empty Gunny Bags on 26th May




TTD will conduct an e-auction of used empty gunny bags collected from Tirumala Srivari Temple and other TTD-affiliated temples for the year 2026-27 on May 26.


Interested bidders should pay an EMD of Rs.75,000 online before noon on May 25.


For details, contact the TTD Marketing Office, Tirupati, during office hours.

Phone: 0877-2264429

www.konugolu.ap.gov.in

టీటీడీకి రూ.1.51 కోట్లు విరాళం donation




రిలయన్స్ సంస్థ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పి.ఎం.ఎస్ ప్రసాద్ గురువారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు.


మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.

14.5.26

TTD JEO Reviews Sri Padmavati Children Hospital Building Works





TTD JEO (Health & Education) Dr. A. Sharath directed officials to complete the construction works of the new Sri Padmavathi Children’s Hospital building in Tirupati by July 31 this year, as per the instructions of TTD EO Sri M. Ravichandra.


The JEO inspected the ongoing works along with engineering officials on Wednesday and stressed the need to complete the project with quality standards and planned execution to provide advanced medical services for children.


He instructed officials to prepare detailed floor-wise plans covering medical facilities, electrical works, air-conditioning, computer networking and patient amenities.


 He also directed engineering officials to speed up the works with coordination among all departments and submit regular progress reports.


Hospital Director Dr. N. Srinath Reddy and engineering officials were also present.

IntegratedCommand Control Centre Ensuring Faster Darshan for Devotees





Despite the heavy influx of devotees to Tirumala during the summer holidays, TTD is effectively utilizing modern technology to provide devotees with faster and more comfortable darshan facilities. The Integrated Command Control Center is playing a crucial role.


Officials are continuously monitoring the situation at Vaikuntham Queue Complexes, Narayanagiri Sheds, Annaprasadam Centers, major roads, parking areas, and temple surroundings through the Integrated Command Control Center. Hundreds of CCTV cameras installed across Tirumala are being used to constantly analyze devotee movement, crowd intensity, and queue flow, enabling authorities to take immediate decisions whenever required.


Coordinated measures are being implemented to ensure that devotees do not have to wait for long periods at any location. 


Queue lines are being balanced efficiently, additional staff are being deployed wherever necessary, and drinking water, milk, Annaprasadam, and medical services are being provided promptly. As a result, there has been significant improvement in managing darshan timings.


Particularly at Narayanagiri Sheds and Vaikuntham Queue Complexes, crowd levels are being digitally monitored and devotees are allowed forward in batches accordingly. 


This system is helping devotees reach darshan smoothly without inconvenience.


Due to the modern crowd-management systems implemented by TTD, queue lines appear less congested despite the heavy pilgrim turnout. 


Unlike earlier times when devotees had to remain in queues for several hours, the coordinated technological approach adopted by TTD is enabling faster movement of devotees towards darshan.


Under the directions of superior authorities, officials are utilizing the Integrated Command Control Center system more effectively with the objective of providing devotees a hassle free and quicker darshan experience. TTD officials are working round-the-clock to ensure efficient crowd management.


At present, during the summer rush, more than 85,000 devotees are being provided darshan on Saturdays and Sundays.  TTD is making special efforts to facilitate darshan for more than 75,000 devotees daily.


Significantly, on May 2, a record 91,005 devotees had darshan of the Sri Venkateshwara.


Devotee Darshan Statistics -  May (2024–2026)


Date      | 2024    | 2025    | 2026

--------------------------------------

May 1     | 72,510  | 57,863  | 71,008

May 2     | 65,313  | 74,344  | 91,005

May 3     | 62,624  | 84,113  | 83,091

May 4     | 77,848  | 83,380  | 70,996

May 5     | 81,927  | 65,095  | 76,240

May 6     | 76,748  | 69,214  | 71,029

May 7     | 65,146  | 71,001  | 70,001

May 8     | 64,766  | 64,850  | 67,222

May 9     | 65,508  | 66,821  | 81,512

May 10    | 60,545  | 85,078  | 85,942

May 11    | 76,945  | 80,423  | 78,985

May 12    | 80,001  | 68,760  | 80,389

-----------------------------------------

Total     | 8,49,881| 8,10,942| 9,27,420

---------------------------------------


Summer Rush Darshan Statistics over the Last Three Years


2024

March: 21.10 lakh

April: 20.17 lakh

May: 20.73 lakh


2025

March: 21.31 lakh

April: 20.73 lakh

May: 22.60 lakh


2026

March: 22.28 lakh

April: 21.65 lakh

May: 9.27 lakh (up to May 12)

శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు జూలై 31లోపు పూర్తి చేయాలి : టిటిడి జేఈవో డా. ఎ. శరత్ children hospital






తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ నులను టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు ఏడాది జూలై 31 తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. . శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు.


సందర్భంగా జేఈవో డా. . శరత్ మాట్లాడుతూ, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికాబద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు చేయనున్న విభాగాలు, గదులు, వైద్య సదుపాయాలు, మౌళిక వసతులు తదితర అంశాలను స్పష్టంగా ప్రతిబింబించేలా నివేదిక సిద్ధం చేయాలన్నారు.


అదేవిధంగా ప్రతి ఫ్లోర్‌లోని గదు వారీగా ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్, వైద్య పరికరాలు, వైద్యులు మరియు రోగుల అవసరాలకు అనుగుణంగా కల్పిస్తున్న సౌకర్యాలను లే అవుట్ ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు.


అనంతరం రెండో అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన, ప్రతి గదిలో రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా అన్ని శాఖలు మన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో జరుగుతున్న పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.


తదుపరి శాఖల వారీగా కొనసాగుతున్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జేఈవో, ఇంజనీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.


కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈ శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈఈ శ్రీ హర్షవర్థన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.