17.5.26

“శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం”కు భక్తుల నుండి విశేష ఆదరణ homam




హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి సప్త గోప్రదక్షిణ మండపంలో నిర్వహిస్తున్నశ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశే హోమంకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.


సనాతన భారతీయ సంస్కృతిలో యజ్ఞ, యాగాదులకు అత్యున్నత స్థానం ఉంది. భక్తుల సంకల్పాలను భగవంతుని సన్నిధికి చేర్చే పవిత్ర వేదికగా హోమ కార్యక్రమాన్ని టీటీడీ 2023 నవంబరు 23 ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాశీస్సులతో కొనసాగుతున్న దివ్య హోమం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల డుమ వైభవంగా జరుగుతోంది.


అత్యంత వ్యయప్రయాసలతో నిర్వహించాల్సిన హోమాన్ని సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చి టీటీడీ, భక్తుల కోరిక మేరకు 2025 ఆగస్టు 1 నుండి రోజుకు 200 టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జారీ చేయాలని నిర్ణయించింది. టికెట్ పొందిన గృహస్తులు స్వయంగా హాజరై హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది.


టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు రూ.7 కోట్ల వ్యయంతో దాదాపు 500 మంది గృహస్తులు ఒకేసారి పాల్గొనేలా విశాలమైన శాశ్వత యాగశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.


భక్తులకు సులభ దర్శనం కల్పించడమే కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలనే మహోన్నత సంకల్పంతో టీటీడీ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, భజ బృందాలు, అన్నమాచార్య సంకీర్తన ప్రచారం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.


భక్తులు తమ శుభకార్యాలు, జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి విశేష సందర్భాల్లో శ్రీవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని హోమంలో పాల్గొని దివ్య ఆశీస్సులు పొందవచ్చు. రూ.1600/- చెల్లించి ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులు పాల్గొనే అవకాశం కల్పించారు. హోమంలో పాల్గొన్న వారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తారు. టికెట్లను నె రోజుల ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in ఆన్ లైన్ లో నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవాలి.


హోమం అనేది భగవంతుని ఆరాధనలో అత్యం పవిత్రమైన మార్గమని, వేద మంత్రాల శక్తితో దైవానుగ్రహం త్వరగా లభిస్తుందని అర్చకులు తెలిపారు. భక్తులందరూ దివ్య హోమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ కోరింది.

Grand Annual Brahmotsavams of Sri Govindaraja Swamy Vari Temple from 23rd May




TTD EO Muddada Ravi Chandra unveiled the invitation posters of the annual Brahmotsavams of Sri Govindaraja Swamy Temple on Saturday.


The Brahmotsavams will be held from May 23 to 31 with spiritual grandeur and elaborate arrangements for devotees. Garuda Seva on May 27 and Rathotsavam on May 30 will be the major attractions.


The EO instructed officials to ensure smooth arrangements, decorative illumination, flower decorations, LED displays and devotee-friendly facilities during the festival.


Daily Vahana Sevas and spiritual cultural programmes will also be organised throughout the Brahmotsavams.

Electric Bus Donated to TTD




Chairman of Vara Future LLP, Chennai, Sri Vardhaman Jain donated an Olectra electric bus to TTD on Saturday morning.


On this occasion, the donor performed special prayers for the bus in front of the sacred temple of Sri Venkateswara and handed over the bus documents and keys to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary.


Later, the Additional EO travelled in the bus along with the donor and appreciated him, stating that the bus would provide a very comfortable travel experience for pilgrims.


The bus will be utilized as a free transportation service for the convenience of devotees in Tirumala.


Among those present were Temple Dy EO Sri Lokanatham, former TTD Board Member Sri D.P. Anantha, and Tirumala Transport DI Sri. Krishnaiah.


టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం donation





చెన్నైకు చెందిన వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ వర్థమాన్ జైన్ శనివారం ఉదయం టీటీడీకి ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు.


మేరకు దాత శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.


సందర్భంగా అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు.


కాగా బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు గా వినియోగించనున్నారు.


కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు శ్రీ డి.పి.అనంత, తిరుమల ట్రాన్స్ పోర్ట్ డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.


16.5.26

ఆగ‌స్టు నెల దర్శన కోటా విడుదల వివరాలు august darshan quota





ఆగ‌స్టు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు విధంగా ఉన్నాయి.


తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18 ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20 తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.


టికెట్లు పొందిన వారు 20 నుండి 22 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.


21 ఆర్జిత సేవా టికెట్ల విడుదల


కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జి బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను 21 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. అదే విధంగా వార్షిక పవిత్రోత్సవాల (23-08-26 నుండి 25-08-26) టికెట్లను కూడా మే 21 ఉదయం 10గం. ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు.


వర్చువల్ సేవల కోటా విడుదల


వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


23 అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల


అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.


శ్రీవాణి దర్శన కోటా విడుదల


శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.


వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా


వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23 మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.


25 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల


ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.


తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌


తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.


ఈ కూర పొడితో కూర రుచి అదుర్స్ | Tasty Kerala Veg Curry with Greens and Ladies Finger https://youtu.be/Vn2NNb6Qtng


ఈ కూర పొడితో కూర రుచి అదుర్స్ | Tasty Kerala Veg Curry with Greens and Ladies Finger

https://youtu.be/Vn2NNb6Qtng

₹10 Lakhs Donated to TTD




Sri Tirumalashetty Bhavish Krishna from Kavali, Nellore district, donated Rs.10,00,116 to the Sri Balaji Arogya Varaprasadini Scheme (SVIMS) of TTD on Friday.


In this regard, the donor handed over the donation DD to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.