19.5.26

టీటీడీకి రూ.50 లక్షలు విరాళం donation




బెంగుళూరుకు చెందిన శ్రీమతి స్వాతి ఎన్.వి, శ్రీ సి..శ్రీనివాస శాస్త్రీ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.50,00,101 విరాళంగా అందించారు.


ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

Koil Alwar Tirumajanam at Sri Govindaraja Swamy Vari Temple





Koil Alwar Tirumanjanam was performed grandly at the Sri Govindaraja Swamy Temple on Monday morning ahead of the annual Brahmotsavams from May 23 to 31.


The temple premises and sub-shrines were cleansed with sacred scented water mixed with traditional aromatic ingredients, creating a divine spiritual atmosphere.


After the ritual, devotees were allowed for Sarva Darshan.


Temple officials, priests and staff participated in the programme.

శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar tirumanjanam






తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. మే 23 నుండి 31 తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయబద్ధంగా పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.


అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పరిమళాలతో నిండిపోయింది.


తదనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రంజిత్, అర్చక బృందం పాల్గొన్నారు.

Annural Brahmotsavams of Sri Venugopala Swamy Vari Temple at Kaarvetinagarama form 6th June to 14th June




The annual Brahmotsavams of Sri Venugopalaswamy along with Sri Rukmini and Satyabhama at Karvetinagaram, will be held from June 6 to 14 in a grand manner. The festivities will commence with Ankurarpanam on the evening of June 5.


Koil Alwar Tirumanjanam will be observed at the temple on June 2 from 7.30 am to 11.30 am.


Various Vahana Sevas will be conducted every day during the Brahmotsavams. Garuda Seva will be held on June 10 and Rathotsavam on June 13.


Sri Swamivari Kalyanotsavam will be performed on June 9. Devotees can participate by paying Rs.300 per couple.


Pushpayagam will be conducted on June 15 from 1.30 pm to 4 pm.

జూన్ 05న అంకురార్పణతో కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభం karveti nagaram





కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5 తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


జూన్ 02 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


పవిత్ర ఉత్సవాలకు ముందుగా జూన్ 2 తేదీ ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేయనున్నారు.


నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి సుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.


వాహన సేవల వివరాలు


బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల రకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.


జూన్ 6 – ధ్వజారోహణం (ఉదయం 8:10 నుండి 8:45 వరకు కర్కాటక లగ్నం), రాత్రి పెద్దశేష వాహనం

జూన్ 7 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

జూన్ 8 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

జూన్ 9 – ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం

జూన్ 10 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి హాగరుడ వాహనం

జూన్ 11 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

జూన్ 12 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

జూన్ 13 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

జూన్ 14 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

జూన్ 09 శ్రీ స్వామివారి కల్యా మహోత్సవం


బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన జూన్ 9 స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) సేవలో పాల్గొనవచ్చు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం ప్రసాదంగా అందజేయనున్నారు.


జూన్ 15 పుష్పయాగం


అలాగే జూన్ 15 తేదీ మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు పుష్పయాగం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు.