21.5.26

Chiranjeevi's158th Movie Launched with Pooja













 

Rashi Singh
















 

Srivari Sare Presented Grandly to Kuppam Prasanna Tirupati Gangamma





Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Wednesday offered TTD’s traditional Srivari Sare to Goddess Prasanna Tirupati Gangamma during the annual jatara at Kuppam in Chittoor district.

The Chief Minister and his spouse performed special prayers and sought the blessings of the Goddess for the prosperity, peace, and well-being of the people of the State. They also had the rare Viswaroopa Darshan of the deity.

A large number of devotees thronged the temple to witness the once-a-year Viswaroopa Darshan amid a spiritually vibrant atmosphere.

TTD Additional EO Sri C.H. Venkaiah Chowdary, Board Member Sri Shantaram, Deputy EO Sri Lokanatham, priests, and officials were present.

కుప్పం ప్రసన్న తిరుపతి గంగమ్మకు వైభవంగా శ్రీవారి సారె kuppam temple




చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్ జాతర సందర్భంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మవారికి టిటిడి తరఫున  శ్రీవారి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రివర్యులు అమ్మవారిని ప్రార్థించారు. అంతకుముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీ శ్రీవారి సారెను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు.

ఏడాదికి ఒక్కసారే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారామ్, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, టీటీడీ అర్చకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

జూన్ 5న నాగలాపురంలో శ్రీ వేద నారాయణస్వామివారి దివ్య పుష్పయాగ మహోత్సవం




నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో జూన్ 5 తేదీన  పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సందర్భంగా ఆలయం పుష్ప సుగంధాలతో, భక్తిరస వాతావరణంతో ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకోనుంది.


ఇందుకోసం జూన్ 4 తేదీ సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.


జూన్ 5 ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం జరగనుండగా, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తి శ్రద్ధల మధ్య పుష్పయాగం నిర్వహిస్తారు.


  మహోత్సవంలో వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష అభిషేకాలు సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను అలరించనుంది.


గృహస్తులు ఇద్దరు కలిసి రూ.750/- టికెట్‌ ద్వారా పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు తెలిపారు.


ఆలయంలో మే 1 నుండి 9 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల సందర్భంగా అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగి ఏవైనా లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు.

Pushpa Yagam at Sri Vedanaryana Swamy Vari Temple on 5th June




Pushpayagam will be observed grandly at Sri Vedanarayana Swamy Temple on June 5.


As part of the ritual, Punyahavachanam, Rakshabandhanam, Mrutsangrahanam, Senadhipati Utsavam and Ankurarpanam will be conducted on June 4 from 6.15 pm to 7.45 pm.


On June 5, Snapana Tirumanjanam will be held at 11 am, followed by Pushpayagam from 3 pm to 5.30 pm with various flowers and sacred leaves offered to the deity. Veedhi Utsavam will take place from 6.30 pm to 8 pm.


Couples can participate in the seva by purchasing a ticket costing Rs.750.


Temple priests said the Pushpayagam is performed as a ritual of atonement for any inadvertent lapses during the annual Brahmotsavams and daily rituals held recently.

Narayanavanam Fete Posters Released





TTD EO Sri Muddada Ravichandra unveiled the posters and pamphlets of the annual Brahmotsavams of Sri Kalyana Venkateswaraswamy temple at Narayanavanam on Wednesday.

The annual Brahmotsavams will be held from May 28 to June 5 in a grand spiritual atmosphere. Koil Alwar Tirumanjanam will be observed on May 24, Ankurarpanam on May 27 and Kalyanotsavam on June 4.

The EO instructed officials to make extensive arrangements for devotees, including drinking water, Annaprasadams, shamianas, electrical illuminations, flower decorations, rangolis and cultural programmes.

Various Vahana Sevas will be conducted every day during the Brahmotsavams.

Local temple DyEO Smt Nagaratna, priests and temple officials were present.