24.5.26

వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత గోవిందుడు lord govindaraja








తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు దివ్య మంగళ విహారం చేసి భక్తులను అనుగ్రహించారు.


ఆదిశేషునిపై శేషశాయిగా వెలసిన స్వామివారు అపూర్వ దివ్యకాంతులతో భక్తులను పరవశింపజేశారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుండగా మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, గోవింద నామస్మరణల నడుమ స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.


అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు సమర్పిస్తూ, కర్పూర హారతులు ఇస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించుకున్నారు. గోవింద నామాలతో మారుమోగిన మాడవీధులు ఆధ్యాత్మిక పారవశ్యానికి నిలయంగా మారాయి.


శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రంగా సేవలందిస్తూశేషశాయిమహిమను సార్థకం చేస్తున్నాడు. శేషవాహన సేవ ద్వారాశేషునిలా నిత్యం భగవంతునికి సేవ చేస్తూ ధర్మమార్గంలో నడిచే వారికి దైవానుగ్రహం లభిస్తుందిఅనే ఆధ్యాత్మిక సందేశాన్ని స్వామివారు భక్తులకు బోధిస్తున్నారని ఆగమ పండితులు తెలిపారు.


బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోవ రోజు ఆదివారం ఉదయం 7 గం.లకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గం.లకు హంస వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షిస్తారు.


కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, శ్రీ రంజిత్‌, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sri Govindaraja Swamy Vari Temple Brahmotsavams - Peddasesha Vahanam














 Sri Govindaraja Swamy Vari Temple Brahmotsavams - Peddasesha Vahanam

Dazzling Illuminations add Divine Glow to Sri Govindaraja Swamy Temple Brahmotsavams









The annual Brahmotsavams of Sri Govindaraja Swamy Temple are shining with spectacular electrical illuminations and spiritual grandeur from May 23 to 31.


The temple surroundings and mada streets have been beautifully decorated with vibrant lighting displays depicting the Dasavatarams of Lord Mahavishnu, creating a divine atmosphere for devotees.


Illuminated forms of Matsya, Kurma, Varaha, Narasimha, Vamana, Parasurama, Balarama, Sri Rama, Sri Krishna and Kalki avatars are captivating pilgrims and enhancing the festive spirit in Tirupati.


Special lighting arches, floodlights, decorative gateways and illuminated pathways have been arranged across the four mada streets for the convenience of devotees attending the vahana sevas.


The dazzling decorations have transformed Tirupati into a celestial Vaikuntham, offering devotees a spiritually enriching experience during the Brahmotsavams.

దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు govindaraja swamy








తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31 తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలను దివ్య విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీహరి దశావతార మహిమను ప్రతిబింబించే ప్రత్యేక అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి.


శ్రీ అనంతపద్మనాభ స్వామి, శ్రీమహావిష్ణువు దశావతార రూపాలను కళాత్మక విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహస్వామి, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, బలరామావతారం, హనుమాన్ రూపాలు దర్శనమిచ్చేలా రూపొందించిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


రైల్వే స్టేషన్ సమీపంలో వామనావతారం, రాయలచెరువు గేట్ జంక్షన్ వద్ద బలరామావతారం, బేరీవీధిలో పరశురాముడు, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద హనుమంతుని దివ్య రూపాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతున్నాయి.


అదేవిధంగా శ్రీరామావతారం, శ్రీకృష్ణావతారం, కల్కి అవతారం రూపాలు భక్తులకు భగవద్భక్తిని మరింతగా చాటుతున్నాయి.


నాలుగు మాడవీధుల్లో విద్యుత్ ఆర్చ్‌లు, ఫ్లడ్‌లైట్లు, శోభాయమాన తోరణాలు, బాంబ్ స్టిక్స్‌, నడకదారుల వెంట ప్రత్యేక విద్యుత్ పందిళ్లు ఏర్పాటు చేశారు. వాహనసేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.


దివ్య విద్యుత్ అలంకరణలు తిరుపతిని వైకుంఠనగరిని తలపించేలా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా

టిటిడి ఎలక్ట్రికల్ శాఖ అధికారులు, సిబ్బంది విద్యుత్ అలంకరణలు చేపట్టారు

Annual Brahmotsavams of Sri Govindaraja Swamy Vari Temple Begin Grandly with Dhwajaorahanam










The annual Brahmotsavams of Sri Govindaraja Swamy commenced grandly on Saturday morning with Dhwajarohanam performed in Mithuna Lagnam amid Vedic chants and Govinda namasmarana.


The sacred Garuda flag was ceremoniously hoisted atop the Dwajasthambam between 7.35 a.m. and 8.49 a.m., marking the formal beginning of the nine-day festival and inviting Mukkoti Devatas to the Brahmotsavams.


Earlier, Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi, accompanied by Chakrathalwar and parivara deities, took a ceremonial procession through the four mada streets, blessing devotees.


Special Vedic rituals including Vishwaksena Aradhana, Vastu Homam, Garuda Homam and Raksha Bandhanam were also performed.

Later, Snapana Tirumanjanam was conducted grandly to the utsava deities with milk, curd, honey, coconut water, turmeric and sandal paste.


In the evening, Unjal Seva will be held from 5.30 p.m. to 6 p.m., followed by Pedda Sesha Vahana Seva at 7 p.m., where the deity will bless devotees along the mada streets.


TTD made elaborate arrangements for the Brahmotsavams with decorative lighting, floral arrangements, paintings, rangolis and summer shelters, giving Tirupati a vibrant spiritual atmosphere.


Religious, devotional and cultural programmes are also being organized daily under the auspices of TTD’s Hindu Dharma Prachara Parishad, Annamacharya Project and Dasa Sahitya Project.

Koil Alwar Tirmanjanam on 24th May at Narayanavanam Temple




Koil Alwar Thirumanjanam will be observed at Sri Kalyana Venkateswara Swamy Temple, Narayanavanam, on May 24 from 8.15 AM to 12.45 PM ahead of the annual Brahmotsavams commencing from May 28.


The temple premises and puja articles will be ceremonially cleansed and purified as part of the traditional ritual. Devotees will be allowed for Sarva Darshan from 2.30 PM onwards.