25.5.26

Koil Alwar Tirumanjanam Performed Grandly at Narayanavanam Temple




Koil Alwar Thirumanjanam was observed with religious fervour at the temple of Sri Kalyana Venkateswara Swamy Temple on Sunday from 8am to 2pm.


The ritual was conducted in connection with the annual Brahmotsavams scheduled from May 28 to June 5. As part of the traditional purification ceremony, the temple premises, walls, ceilings and puja articles were thoroughly cleansed.


Later, sacred scented water mixed with ingredients like turmeric, sandalwood powder, kumkum, camphor and other aromatic substances was sprinkled throughout the temple. Devotees were allowed for darshan from 3pm onwards.


Temple Inspector Sri Nagaraju and temple priests participated in the programme.

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం narayanavanam




నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనంవరకు ఘనంగా నిర్వహించారు


ఆలయంలో మే 28 నుండి జూన్ 5 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3  గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు.


కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Lord Govinda Shines on Chinna Sesha Vahanam











On the second day of the annual Brahmotsavams at Sri Govindaraja Swamy Temple, Lord Govindaraja Swamy blessed devotees on Chinna Sesha Vahanam on Sunday morning.


The Vahana Seva was held grandly from 7am to 9am amidst Vedic chants, mangala vadyams, kolatams and bhajans. Devotees offered Harathis and had divine darshan of the Lord.


Later, Snapana Tirumanjanam was performed in Kalyana Mandapam with milk, curd, honey, sandalwood and fruit juices to the utsava deities.


Unjal Seva will be held from 5.30pm to 6pm, followed by Hamsa Vahanam Seva from 7pm to 9pm.


TTD officials, Jeeyars and a large number of devotees participated in the festivities.

చిన్నశేషుడిపై వెలసిన శ్రీ గోవిందుడి దివ్యమహిమ గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి మాడవీధులు chinna sesha vahanam








తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీ గోవిందరాజస్వామివారు చిన్నశే వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు.


ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. ముందుగా గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తబృందాలు చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామసంకీర్తనలతో మాడవీధులను భక్తిరసమయం చేశాయి. మంగళవాయిద్యాల నడు స్వామివారి చిన్నశేష వాహనం దివ్యశోభను సంతరించుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి గోవిందుడిని దర్శించుకొని పరవశించారు.


శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడుశేషి”, జగత్తుశేషభూతంగా భావించబడుతుంది. శేషశేషి తత్వానికి ప్రతీకగా చిన్నశేష వాహనం నిలుస్తుంది. చిన్నశేష వాహనసేవను దర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధి ఫలం లభిస్తుందని ధ్యాత్మిక విశ్వాసం.


అనంతరం ఉదయం 10 గంటల నుండి కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు.


సాయంత్రం 5.30 గంటల నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్‌సేవ జరగనుండగా, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.


వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు, ప్రముఖులు,


టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donation




గుంటూరుకు చెందిన శ్రీ మాదాల శేషగిరిరావు అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు.


అదేవిధంగా గుంటూరుకు చెందిన శ్రీ వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందించారు.


మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు విరాళం డీడీలను అందజేశారు.


కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.

24.5.26

₹30 Lakhs Donation to TTD




A total donation of Rs.30 lakhs was received by the TTD run Sri Venkateswara Annaprasadam Trust on Saturday.


All the three donors from Tirupati, Smt. Kora Sowmya Rs.10,00,116, Sri Birudala Satish Kumar Reddy Rs.10,00,116, and Sri Poorab Saai donated Rs.10 lakhs to the Trust.


The donors handed over the DDs to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Additional EO Camp Office in Tirumala.

Lord Govindaraja Swmay Varu Blesses Devotees on Pedda Sesha Vahanam








Sri Govindaraja Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees on Pedda Sesha Vahanam on the first night of the annual Brahmotsavams in Tirupati on Friday.


Amid Mangala Vadyams, Kolatams, Chekka Bhajans and chants of Govinda Namam, the deity majestically paraded through the four Mada Streets, mesmerizing devotees with divine splendour.


Devotees offered coconuts and Harathis with deep devotion, while the spiritually vibrant atmosphere turned the temple streets into a sea of bhakti.