3.6.26

ఇంజనీరింగ్ పనుల పురోగతిపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష





టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు.


సమావేశం శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో  జరిగింది. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ మరియు సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు.


తరువాత, ఎస్వీ మ్యూజియంకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. పనులన్నింటినీ నిర్దేశిత సమయం లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ, ఎస్ఈ శ్రీ వేణుగోపాల్, ఈఈలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ సుధాకర్, డీఈ ఎలక్ట్రికల్ శ్రీ చంద్రశేఖర్, డిప్యూటీ ఈఓ హెల్త్ మరియు చీఫ్ మ్యూజియం ఆఫీసర్ శ్రీ సోమన్ నారాయణ, డిప్యూటీ ఈఓ రిసెప్షన్ శ్రీ భాస్కర్, జీఎం ఐటీ శ్రీ వెంకటేశ్వర్లు నాయుడు, వీజీఓ శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


హిమయత్‌నగర్‌లో శ్రీనివాసుని బ్రహ్మోత్సవ వైభవానికి ఘన శ్రీకారం himayatnagar temple




హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం 21 వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, గోడ పత్రికలను టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


జూన్ 19 నుండి 24 వరకు బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంకురార్పణతో ప్రారంభం – ధ్వజావరోహణంతో ముగింపు


జూన్ 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 20న కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, విద్యుద్దీపాల అలంకరణలు ఏర్పాటు చేయాలని ఛైర్మన్ సూచించారు.


వాహనసేవల విశేషాలు


🔸 జూన్ 20 – ఉదయం శేష వాహనం, రాత్రి హనుమంత వాహనం


🔸 జూన్ 21 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం


🔸 జూన్ 22 – ఉదయం గజ వాహనం, ఉదయం శాంతి కల్యాణం, రాత్రి గరుడ వాహనం


🔸 జూన్ 23 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం


చక్రస్నానం – పుష్పయాగంతో ఆధ్యాత్మిక పరవశం


జూన్ 24న ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.


అన్నప్రసాద వితరణ – సాంస్కృతిక కార్యక్రమాలు


బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ జరగనుండగా, భక్తులను అలరించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.


ఈ కార్యక్రమంలో ఎల్.ఏ.సీ. అధ్యక్షులు శ్రీ శంకర్ గౌడ్, టెంపుల్ ఏఈవో శ్రీ యు. రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మణికంఠ, వేద పారాయణదారులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.