4.6.26

మే నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూల విక్రయం srivari laddu











కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది.


ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయమయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.


2024 మే నెలలో 1.01 కోట్ల లడ్డూలు విక్రయమవ్వగా, 2025లో 1.10 కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం 2026లో 1.21 కోట్లకు పైగా విక్రయాలు నమోదవడం విశేషం.


రోజుకు 4 లక్షలకుపైగా లడ్డూల తయారీ


శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న టీటీడీ, రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా, ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది.


లడ్డూ తయారీకి 68 టన్నుల ముడి దార్థాల వినియోగం


అత్యంత పవిత్రమైన శ్రీవారి ప్రసాదమైన లడ్డూల తయారీ కోసం రోజువారీగా 68 టన్నులకు పైగా ముడి దార్థాలను టీటీడీ వినియోగిస్తోంది.


లడ్డూ తయారీకి రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శెనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండుద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండ వినియోగిస్తున్నారు.


ఒక్క చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుండి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శెనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండుద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి.


జీఐ గుర్తింపుఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్


ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన "తిరుపతి లడ్డూ"కు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. అదేవిధంగా లడ్డూ తయారీ, విక్రయాలకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది.


అత్యాధునిక సాంకేతికతతో నాణ్యత నియంత్రణ


ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోటులో రెండు అత్యాధునిక ఏఐ ఆధారి కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు.


అలాగే పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకులను కొనుగోలు విభాగం సేకరించి, ప్రయోగశాల పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది.


సంప్రదాయ దిట్టం ప్రకారమే తయారీ


శ్రీవారి ప్రసాదాల తయారీలో 1950, 1951 సంవత్సరాల్లో టీటీడీ ఆమోదించిన సంప్రదాయ "దిట్టం" ప్రమాణాలను నేటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. నిత్య, వార, పక్ష, మాస, నక్షత్ర, సాలకట్ల ఉత్సవాలకు అనుగుణంగా సుమారు 20 రకాల అన్నప్రసాదాలు, 25 రకాల పణ్యారాలను సిద్ధం చేస్తున్నారు.


24 గంటలూ నిరంతరాయంగా సేవలు


శ్రీవారి పోటులో రెండు షిఫ్టుల్లో సుమారు 700 మంది శ్రీవైష్ణవ బ్రాహ్మణులు భక్తి శ్రద్ధలతో 24 గంటలూ సేవలందిస్తూ లడ్డూ ప్రసాదాల తయారీలో పాల్గొంటున్నారు. వీరికి టీటీడీ సిబ్బంది, పర్యవేక్షకులు సహకరిస్తున్నారు.


భారీ మౌలిక సదుపాయాలు


లడ్డూ తయారీ ప్రక్రియలో భాగంగా బూంది పోటు, పడి పోటు, అదనపు పోటు, అంతర్గత పోటు వంటి ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి.


•  రోజుకు 15 టన్నుల శెనగపప్పును పిండిగా మార్చే ఫ్లోర్ మిల్

•  2,10, 000 కిలోల సామర్థ్యం గల నెయ్యి నిల్వ ట్యాంకులు

•  30 టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ప్లాంట్

•  2 నుండి 7 రోజుల వరకు ముడి సరుకులు నిల్వ ఉంచగల ఉగ్రాణం

•  కన్వేయర్ బెల్ట్ వ్యవస్థ ద్వారా బూంది తరలింపు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.


భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు


తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్‌లో 56 కౌంటర్ల ద్వారా మూడు షిఫ్టుల్లో 24 గంటలూ లడ్డూల విక్రయం, పంపిణీ జరుగుతోంది.


అదనపు లడ్డూల కొనుగోలు కోసం డిజిటల్ చెల్లింపులతో పనిచేసే కియోస్క్ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నారు.


ప్రత్యేక రోజులకు భారీ బఫర్ స్టాక్


భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఎలాంటి కొరత రాకుండా 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుతున్నారు.


భక్తుల ప్రశంసలు


ఇటీవలి కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి మరింత మెరుగుపడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత, సంప్రదాయం, భక్తి భావనల సమ్మేళనంగా నిలిచి శ్రీవారి లడ్డూ ప్రసాదం తిరుమల మహత్యా


చంద్రప్రభపై నవనీత కృష్ణునిగా భక్తులను మురిపించిన కల్యాణ శ్రీనివాసుడు chandra prabha vahanam




నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు బుధవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. నవనీత కృష్ణుడు అలంకారంలో చంద్రప్రభ వాహనంపై ఊరేగిన స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.


చంద్రుని శీతల కిరణాలవలె ప్రశాంతమైన తేజస్సుతో వెలుగొందిన స్వామివారి రూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంతో గోవింద నామస్మరణలు చేస్తూ ఆనందభాష్పాలతో స్వామివారిని సేవించారు.


గోవింద నామస్మరణలతో మార్మోగిన నారాయణవనం


స్వామివారి విహార మార్గమంతా భక్తజన సందోహంతో కళకళలాడింది. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ భక్తులుగోవిందా... గోవిందా...” నినాదాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాలు, భక్తి గీతాలతో ఉత్సవాలకు అపూర్వ శోభ చేకూరింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


చంద్రప్రభ వాహన సేవ విశిష్టత


సనాతన ధర్మంలో చంద్రుడు శాంతి, సౌభాగ్యం, ఆనందం, పుష్టి ప్రసాదించే దేవతగా భావించబడతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నక్షత్ర సమూహాలలో తనను చంద్రునిగా అభివర్ణించారు. సమస్త జీవజాలానికి పోషకుడైన చంద్రుడు ఔషధీశుడిగా, సస్యకారకుడిగా పూజించబడతాడు.


చంద్రుని చల్లదనం, ప్రశాంతత, ఆనందాన్ని భక్తులకు ప్రసాదించాలనే సంకల్పంతోనే స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సేవను దర్శించడం ద్వారా మనశ్శాంతి, సౌభాగ్యం, శుభసంకల్పాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.


భక్తి కోలాహలంలో దివ్య వాహనసేవ


వాహనసేవకు ముందుగా గజరాజుల శోభాయాత్ర విశేష ఆకర్షణగా నిలిచింది. అనంతరం భక్తజన బృందాలు కోలాటాలు, చెక్కభజనలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ రిగిన దివ్యోత్సవం భక్తులను ధ్యాత్మిక లోకంలో విహరింపజేసింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారి నుగ్రహాన్ని పొందారు.


జూన్ 04 రథోత్సవంశ్రీనివాస కల్యాణ మహోత్సవం


వార్షిక బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవోపేత ఘట్టమైన రథోత్సవం జూన్ 04 ఉదయం 7.45 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 8.30 గంటలకు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరగనున్నాయి.


శ్రీవారి కల్యాణోత్సవంలో రూ.1,000 చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.


కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.