11.6.26

భక్తుల పాలిట ''అక్షయ పాత్ర'' టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం annadanam








కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉచిత అన్నదా కార్యక్రమం నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తూ టీటీడీ సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది.


1985 ఏప్రిల్ 6 ప్రారంభమైన నిత్య అన్నదాన పథకం ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిర్వహించబడుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, వారాంతాల్లో సంఖ్య 3 లక్షలకు మించి ఉంటుంది.


రోజుకు 3 లక్షల సర్వింగ్స్


గత మూడు నెలల సగటు గణాంకాల ప్రకారం రోజుకు సుమారు 70 వేల మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలు అందిస్తున్నారు. అలాగే 60,200 మందికి అల్పాహారం, 99,500 మందికి మధ్యాహ్న భోజనం, 56,700 మందికి రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. విధంగా రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి.


ప్రధాన అన్నప్రసాద భవనం అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో రోజుకు 82 వేల మందికి పైగా భోజనాలు అందుతుండగా, శ్రీ అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు.


15.8 టన్నుల బియ్యంతో భక్తులకు నాణ్యమైన ఆహారం


భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం వినియోగిస్తున్నారు. అదేవిధంగా 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తున్నారు. అలాగే రోజుకు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి దార్థాలు ఉపయోగిస్తున్నారు.


2026 జనవరి నుండి మే వరకు 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్


2026 జనవరి 1 నుండి మే 31 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4.40 కోట్ల సర్వింగ్స్ భక్తులకు అందించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో జనవరిలో కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్‌లో 85 లక్షలు, అలాగే మే నెలలో 92 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాలు అందించారు.


ఆధునికీకరణతో విస్తరిస్తున్న సేవలు


అన్నప్రసాదం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ పలు ఆధునిక చర్యలు చేపట్టింది. చట్నీలు, కూరల తయారీలో తాజా కొబ్బరికాయల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది.


అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన PAC-5 (వెంకటాద్రి నిలయం)లో సుమారు 1,500 మంది ఒకేసారి భోజనం చేసే సామర్థ్యంతో కొత్త డైనింగ్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయి. MTVAC కిచెన్‌లో ఆధునిక వంట పరికరాల ఏర్పాటు, QR కోడ్ ఆధారిత విరాళాల సేకరణ కియోస్క్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు.


రూ.2,500 కోట్లకు పైగా ఫిక్సిడ్ డిపాజిట్లు 


భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం  రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ "అన్నదానం మహాదానం" అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Lord Venugopala Swamy Varu Enthralls Devotees in Mohini Avatara




As part of the annual Brahmotsavams of Sri Venugopala Swamy along with Sri Rukmini and Satyabhama at Karvetinagaram, the Lord blessed devotees in the enchanting Mohini Alankaram on Wednesday morning.


Seated on a palanquin, the Lord toured the temple streets amidst devotional chants, Kolatam performances, and traditional music. Devotees offered Harathis and had divine darshan of the Lord.


The Mohini Avatar symbolizes victory over illusion (Maya) and guides devotees on the spiritual path.


The highly significant Garuda Vahana Seva will be held at 7 p.m. on Wednesday.


Temple officials, priests, and a large number of devotees participated in the Vahana Seva.

మోహినీ రూపంలో మురిపించిన వేణుగోపాలుడు mohini avataram





కార్వేటినగరం శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం దయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అలరించారు.

ఉదయం 7.30 గంటలకు పల్లకిపై గ్రా వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహనసేవకు ముందుగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో భక్తిరసాన్ని పంచగా, మంగళవాయిద్యాల డుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగింది.


అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకున్నారు.


మాయపై విజయం సాధించే సందేశమే మోహినీ అవతారం అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహావిష్ణువు ధరించిన మోహినీ అవతారాన్ని పురాణాలు విశదీకరిస్తున్నాయి. మోహినీ అలంకారంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మాయను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని అవతారం సందేశం ఇస్తుంది.


నేడు రాత్రి గరుడవాహనంపై దివ్య దర్శనం


బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ బుధవారం రాత్రి 7 గంటల నుండి జరగనుంది. సందర్భంగా స్వామివారు గరుడునిపై క్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు.


వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ న్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశే సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

గరుడవాహనంపై గోకులానందుని దివ్య విహారం garuda vahanam


కార్వేటినగరం శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన గరుడవాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. ర్వాలంకార భూషితుడై గరుడునిపై ధిరోహించిన శ్రీ వేణుగోపాలస్వామివారు గ్రామ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు మంగళకర దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు మర్పించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


వైష్ణవ సంప్రదాయంలో గరుడసేవకు విశిష్ట స్థానం పౌరాణిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో గరుడవాహన సేవకు అత్యున్నత ప్రాధాన్యం ఉంది. 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవను మహోత్కృష్టమైన ఉత్సవంగా నిర్వహిస్తారు. భగవంతునికి పరమభక్తుడైన గరుడునిపై విహరించడం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తి మహిమను లోకానికి చాటిచెబుతారు.


జ్ఞానవైరాగ్యాలకు ప్రతీక గరుడ దర్శనం


జ్ఞానవైరాగ్య స్వరూపమైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించి వారికి పాప విమోచనం కలిగి, ఆధ్యాత్మిక పురోగతి సిద్ధిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. గరుడవాహన సేవ ద్వారా స్వామివారు భక్తకోటికి జ్ఞాన, భక్తి, వైరాగ్య మార్గాలను బోధిస్తున్నారని పండితులు వివరిస్తారు.


కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Chief Pontiff of Subramanya Matha Offered Prayers to Lord Venkateswara






H H Sri Vidyaprasanna Theertharu Swamiji of Shri Subrahmanya Matha, Kukke Subrahmanya, Dakshina Kannada offered prayers to Lord Venkateswara Swamy inside Sri Vari Temple in Tirumala on Wednesday morning. On his arrival at infront of Sri Vari Temple, TTD Addl EO Sri Venkaiah Chowdary and Temple Priests welcomed him with Temple Honours and led him to the Sanctum Santorium.

 

DyEO Sri Lokanadham, Peishkar Sri Ramakrishna, and others were present.

జూన్ 22న వైభవంగా పుష్పయాగ మహోత్సవం pushpa yagam




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 22 పుష్పయాగ మహోత్సవం అత్యం వైభవంగా నిర్వహించనున్నారు.


 ఇందుకోసం జూన్ 21 సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగ అంకురార్పణ కార్యక్రమాలు రగనున్నాయి.


జూన్ 22 ఉదయం 9.30 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించగా, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది. సందర్భంగా వివిధ రకా సుగంధ పుష్పాలు, పవిత్ర పత్రాలతో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం వైభవంగా జరుగనుంది.


లోప పరిహారార్థం పుష్పయాగం


వార్షిక బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల నిర్వహణలో అర్చకులు, పరిచారకులు, అధికారులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.


గృహస్తులు (ఇద్దరు) రూ.516/- టికెట్‌ కొనుగోలు చేసి పవిత్ర పుష్పయాగ సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.