13.6.26

టీటీడీ ఆధ్వర్యంలో విజయవంతంగా "యోగ–టీటీడీ ఆరోగ్యానంద" కార్యక్రమం yoga dinotsavam




ఆరోగ్యవంతమైన సమా నిర్మాణం, ఉద్యోగుల్లో శారీరక-మానసిక దృఢత్వం పెంపొందించాలనే లక్ష్యంతో టీటీడీ నిర్వహిస్తున్న "యోగటీటీడీ ఆరోగ్యానంద" కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 7 నుంచి 21 తేదీ వరకు జరుగుతున్న ప్రత్యేక యో శిక్షణలో టీటీడీ ఉద్యోగులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటూ యోగాసనాలను అభ్యసిస్తున్నారు.


14 రోజుల పాటు యోగ శిక్షణ


టీటీడీ ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు ఉద్యోగులు, విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడేలా 14 రోజులపాటు ప్రతిరోజూ గంటసేపు యోగాభ్యాసాన్ని నిర్వహిస్తున్నారు.


టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పర్యవేక్షణలో తిరుపతిలోని 17 కేంద్రాల్లో యోగ శిక్షణ కొనసాగుతోంది. పరిపాలనా భవనం, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, స్విమ్స్, బర్డ్ క్యాంపస్, శ్వేత క్యాంపస్, ఎస్వీ సంగీత నృత్య కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ కోదండరామస్వామి హైస్కూల్, ఎస్పీ గర్ల్స్ హైస్కూల్, వినాయకనగర్, గోవిందరాజనగర్, ఎల్.ఎస్. నగర్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ప్రతిరోజూ యోగాభ్యాసం నిర్వహిస్తున్నారు.


యోగతో మానసిక ప్రశాంతతశారీరక దృఢత్వం


నిత్య యోగాభ్యాసం ద్వారా ఉద్యోగులు మానసిక ఒత్తిడిని అధిగమించి భక్తులకు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని టీటీడీ భావిస్తోంది. యోగ సాధన శారీరక దృఢత్వం, మానసిక వికాసం, ఏకాగ్రత, అంతర్గత చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.


ఈ కార్యక్రమ సమన్వయ బాధ్యతలను టీటీడీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. తిరుపతిలోనే కాకుండా టీటీడీకి చెందిన పలు స్థానిక ఆలయాల్లో కూడా ఉద్యోగులు ప్రతిరోజూ యోగాసనాలు చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


యోగ పోటీలుయోగ దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ


అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 7న తిరుపతి మహతి ఆడిటోరియంలో "యోగ–టీటీడీ ఆరోగ్యానంద" కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 18, 19, 20 తేదీలలో యోగ పోటీలను నిర్వహించనుండగా, జూన్ 21న టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

12.6.26

Better Facilities for Devotees Visiting Sri Padmavati Ammavari Temple



TTD JEO Dr. A. Sharat on Thursday inspected the queue lines at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, to improve facilities for devotees.


He directed officials to modernize and expand the queue lines by installing additional brass grills to handle the increasing devotee turnout, especially on Tuesdays and Saturdays.


The JEO also instructed engineering officials to set up attractive welcome arches at the temple entrances for the convenience of visiting devotees.


Temple and engineering officials were present during the inspection.

భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఆధునీకరణ queue line




తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించేందుకు టీటీడీ జేఈవో డా. . శరత్ గురువారం ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో గురువారం పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.


ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, భక్తులకు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రాస్ గ్రిల్స్‌ను పెంచి క్యూలైన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో అధికంగా ఉండే భక్తుల రద్దీతో పాటు ఇతర రోజుల్లో కూడా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.


అలాగే తిరుచానూరు ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా గుర్తించేలా ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద ఆకర్షణీయమైన స్వాగత ఆర్చ్‌లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.


శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ నరసింహమూర్తి, విజీవో శ్రీ గిరిధర్, ఏవీఎస్వో శ్రీ రాధాకృష్ణ, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌లు శ్రీ సురేష్, శ్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

TTD JEO A Sharath Inspects Accommodation Facilities for Srivari Medical Service Excperts



TTD JEO Dr. A. Sharath on Thursday inspected the accommodation facilities being arranged for the medical experts who will participate in Srivari Medical Services and serve devotees.


He directed officials to complete all infrastructure and basic amenities well before the arrival of the first batch of medical experts on June 17. He reviewed facilities at Vasishta Guest House, Ayurveda College Guest House and SVIMS Guest House.


The JEO instructed officials to ensure cleanliness, drinking water, power supply and other essential amenities so that doctors can render services to devotees without any inconvenience.


TTD officials, SVIMS officials and medical officers were present.

శ్రీవారి భక్తసేవకు వచ్చే వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై జేఈవో డా. ఎ. శరత్ పరిశీలన ttd jeo




శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన తిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. . శరత్ అధికారులను ఆదేశించారు. మేరకు గురువారం సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు.


నెల 17 తేదీన తొలి విడత వైద్ నిపుణులు రానున్న నేపథ్యంలో శిష్ఠ అతిథి గృహం, ఆయుర్వేద కళాశాల అతిథి గృహం, స్విమ్స్ అతిథి గృహాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


వైద్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సేవలందించే విధంగా వసతి గృహాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం దితర మౌలిక వసతులను సమృద్ధిగా ల్పించాలని ఆదేశించారు.


కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈలు శ్రీ మనోహరం, శ్రీ వేంకటేశ్వర్లు, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కుసుమ కుమారి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, బర్డ్ సూపరింటెండెంట్ శ్రీ వెంకట రెడ్డి, టీటీడీ మరియు స్విమ్స్ అధికారులు పాల్గొన్నారు.