14.6.26

టీటీడీకి ట్రక్కు విరాళం donation





ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది.


మేరకు సంస్థ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.


కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇన్ చార్జ్ జీఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.


13.6.26

Ivy Gourd in Spicy Onion Masala | Simple Yet Irresistible | ఉల్లికారం తగిలిన దొండకాయ కూర–అదిరిపోయే కాంబినేషన్ https://youtu.be/4FSk-NjNQTA


Ivy Gourd in Spicy Onion Masala | Simple Yet Irresistible | ఉల్లికారం తగిలిన దొండకాయ కూర–అదిరిపోయే కాంబినేషన్

https://youtu.be/4FSk-NjNQTA

జూన్ 16 నుండి 25 వరకు వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రబంధ పాశురాల గానామృతంతో ఆధ్యాత్మిక వైభవం sri lakshmi narayana swamy




తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారాయణస్వామి వారి ఆలయంలో జూన్ 16 నుండి 25 తేదీ వరకు శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.


ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వార్‌వారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాశురాలను నివేదించనున్నారు. పాశురాల గానామృతంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగనుంది.


జూన్ 25 తిరుమంజనం, గరుడగజ వాహనాలపై దివ్య విహారం


ఉత్సవాల చివరి రోజైన జూన్ 25 దయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించనున్నారు.


శ్రీమన్నారాయణుని పరమభక్తుడు శ్రీ పెరియాళ్వార్


శ్రీ పెరియాళ్వార్ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడైన పరమభక్తుడు. భక్తి సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని పొందిన ఆయన, శ్రీ ఆండాళ్ అమ్మవారికి తండ్రి. ప్రతిరోజూ తులసీమాలలను తయారు చేసి స్వామివారికి సమర్పిస్తూ గవత్సేవలో జీవితాన్ని అంకితం చేశారు. ఆయన సాన్నిధ్యంలో పెరిగిన ఆండాళ్ అమ్మవారు శ్రీమన్నారాయణునినే తన భర్తగా భావించి భక్తి మార్గంలో ఆదర్శంగా నిలిచారు.


దివ్య ప్రబంధాలలో ఎన్నో అమూల్యమైన పాశురాలను రచించిన శ్రీ పెరియాళ్వార్‌కు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం కలిగిన మహాభాగవతుడిగా వైష్ణవ సంప్రదాయం కీర్తిస్తుంది.

Sri Venugopala Swamy Varu Appears as Navaneeta Krishna on Chandra Prabha Vahanam





As part of the annual Brahmotsavams of Sri Rukmini-Satyabhama Sametha Sri Venugopala Swamy at Karvetinagaram, the Lord blessed devotees on Friday night in the enchanting form of Navaneeta Krishna atop Chandraprabha Vahanam.


The divine procession amid devotional chants and traditional music filled the temple premises with spiritual fervour. The Vahana Seva symbolized peace, bliss and prosperity bestowed by Lord Krishna.


Temple officials, priests and a large number of devotees participated in the event.

Sri Venugopala Swamy Varu Blesses Devotees on Surya Prabha Vahanam




As part of the annual Brahmotsavams of Sri Rukmini and Satyabhama Sametha Sri Venugopala Swamy at Karvetinagaram, the Lord graced devotees on Surya Prabha Vahanam on Friday morning.

 

Devotees offered Harathis and participated in the procession with devotion.


The Surya Prabha Seva symbolized the divine radiance of Surya, the source of life and energy. Sri Venugopala Swamy will bless devotees on Chandra Prabha Vahanam at 7.30 p.m. on Friday.


The grand Rathotsavam will be held on June 13 at 7.30 a.m., followed by Aswa Vahanam Seva at 7 p.m.


Temple officials, priests, and a large number of devotees participated in the Vahana Seva.

చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడిగా భక్తులను మురిపించిన శ్రీ వేణుగోపాలస్వామి chandra prabha vahanam





కార్వేటినగరం శ్రీ రుక్మిణిసత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారు నవనీత కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.


చంద్రకాంతుల మధ్య వెన్నముద్దను ధరించిన బాలకృష్ణుని రూపంలో స్వామివారు దర్శనమివ్వగా, గోవింద నామస్మరణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయాయి. స్వామివారి మనోహర రూపాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.


ఔషధాలకు, జీవజాతికి పోషకుడైన చంద్రభగవానుడు శాంతి, శీతలత్వం, నందానికి ప్రతీక. చంద్రప్రభ వాహనంపై విహరించే శ్రీకృష్ణ పరమాత్మ భక్తుల జీవితాల్లో ప్రశాంతత, సౌభాగ్యం, ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదిస్తాడనే సందేశాన్ని వాహనసేవ చాటిచెబుతుంది.


కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Supreme Court Judge Reaches Tirumala





Supreme Court Judge Justice B.V.Nagaratna along with his family members, arrived in Tirumala on Friday evening.

  

On his arrival at Sri Bagya Rest House, he was welcomed by AP High Court Chief Justice Lisa Gill, TTD Addl EO Sri Ch. Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna.