25.10.26

Pournami Garuda Seva on 26th October




The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on October 26.


Sri Malayappa Swamy will be paraded on the mighty Garuda Vahanam between 7pm and 9pm.


TTD officials, devotees participate in this vahana seva.

అక్టోబరు 26న శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడ సేవ govindaraja swamy vari temple




పౌర్ణమి సందర్భంగా  అక్టోబరు 26న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ జరుగనుంది.

ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారు గరుడునిపై ఆలయ ప్రధాన వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

Pournami Garuda Seva at Sri Govindaraja Swamy Vari Temple on 26th October




The Pournami Garuda Seva of Sri Govindaraja Swamy Temple in Tirupati will be held on October 26.


As part of the monthly full-moon tradition, the deity will bless devotees on Garuda Vahanam along the temple streets from 6 PM to 8 PM.

అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ POURNAMI GARUDASEVA




తిరుమలలో అక్టోబర్ 26వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.

రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

24.10.26

ANNUAL PAVITROTSAVAMS FROM OCTOBER 24 TO 26


TTD will conduct the annual Pavitrotsavams at Sri Pattabhirama Swamy Temple in Valmikipuram, Annamayya district, from October 24 to 26. Ankurarpanam was performed on Friday evening.


The rituals include Pavitra Pratishtha and Snapana Tirumanjanam on October 24, Pavitra Samarpana on October 25, and Maha Purnahuti and Chakrasnanam on October 26. A street procession of the deity will be held on the final evening.


Significance: Pavitrotsavams are performed to atone for any known or unknown ritual lapses during daily worship and other temple festivals.


Devotees can participate with a ticket costing ₹300, which admits two persons. TTD appeals to devotees to take part and receive the blessings of Sri Pattabhirama Swamy.


TTD Special Grade Deputy EO Smt. Varalakshmi, AEO Sri Gopinath, Temple Inspector Sri Umapathi, priests, staff and devotees participated in the event.

Water Level in Tirumala Reservoirs Rises by 61.68 Lakh Gallons






The water levels in the five major reservoirs of Tirumala increased slightly 61.68 lakh gallons as of Friday morning.


While 21.60 lakh gallons of water was used, 40.08 lakh gallons remained as surplus.


Papavinasanam dam:

Increase of 20.96 lakh gallons; surplus of 6.86 lakh gallons


Gogarbham dam: Increase of 9.25 lakh gallons; surplus of 1.75 lakh gallons


Akashaganga dam: Increase of 6.33 lakh gallons; surplus of 6.33 lakh gallons


Kumaradhara dam: Increase of 25.14 lakh gallons; surplus of 25.14 lakh gallons


Pasupudhara dam: No change in water level.

అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీ పట్టాభిరామ స్వామివారి పవిత్రోత్సవాలు pavitrotsavams



అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా 23వ తేదీ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ  కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్టోబర్ 24న పవిత్ర ప్రతిష్ఠ, స్నపన తిరుమంజనం; 25న పవిత్ర సమర్పణ; 26న మహా పూర్ణాహుతి, చక్రస్నానం నిర్వహించనున్నారు. చివరి రోజు సాయంత్రం స్వామివారి తిరుచ్చి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల విశిష్టత

ఆలయంలో నిత్యం నిర్వహించే అర్చనలు, ఆర్జిత సేవలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర వైదిక క్రతువుల్లో తెలిసీ తెలియక సంభవించే దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అంకురార్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ, విశేష హోమాలు, పవిత్ర సమర్పణ, పూర్ణాహుతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తద్వారా స్వామివారి కృపాకటాక్షాలు భక్తులపై ప్రసరించి, సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తారు.

పవిత్రోత్సవాల్లో పాల్గొనదలచిన భక్తులు ఒక్క టికెట్‌కు రూ.300 చెల్లించాలి. ఒక్క టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పిస్తారు. భక్తులు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని శ్రీ పట్టాభిరామ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

తిరుమల జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీటి పెరుగుదల reservoirs




తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో శుక్రవారం వరకు మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీటి మట్టం పెరిగింది.

తిరుమలలో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం నాటికి ఈ ఐదు జలాశయాల్లో కలిపి 21.60 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగించగా, 40.08 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా నిల్వ ఉంది.

జలాశయాల వారీగా నీటి నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్

నిల్వ సామర్థ్యం: 5,240.00 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 2,667.39 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 2,688.35 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 20.96 లక్షల గ్యాలన్లు

వినియోగం: 14.10 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 6.86 లక్షల గ్యాలన్లు

2) గోగర్భం డ్యామ్

నిల్వ సామర్థ్యం: 2,833.10 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 499.06 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 508.31 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 9.25 లక్షల గ్యాలన్లు

వినియోగం: 7.50 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 1.75 లక్షల గ్యాలన్లు

3) ఆకాశగంగ డ్యామ్

నిల్వ సామర్థ్యం: 685.00 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 24.07 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 30.40 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 6.33 లక్షల గ్యాలన్లు

వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 6.33 లక్షల గ్యాలన్లు

4) కుమారధార డ్యామ్

నిల్వ సామర్థ్యం: 4,259.01 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 338.84 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 363.98 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 25.14 లక్షల గ్యాలన్లు

వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 25.14 లక్షల గ్యాలన్లు

5) పసుపుధార డ్యామ్

నిల్వ సామర్థ్యం: 1,287.54 లక్షల గ్యాలన్లు

గత రోజు నిల్వ: 24.38 లక్షల గ్యాలన్లు

ప్రస్తుత నిల్వ: 24.38 లక్షల గ్యాలన్లు

పెరిగిన నీరు: 0.00 లక్షల గ్యాలన్లు

వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు

మిగులు నీరు: 0.00 లక్షల గ్యాలన్లు

మొత్తంగా ఐదు జలాశయాల్లో 61.68 లక్షల గ్యాలన్ల నీరు పెరగ్గా, 21.60 లక్షల గ్యాలన్ల నీరు వినియోగమైంది. ప్రస్తుతం 40.08 లక్షల గ్యాలన్ల నీరు మిగులుగా ఉంది. ఆకాశగంగ డ్యామ్ పరిధిలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02 లక్షల గ్యాలన్లు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది. అక్టోబర్ 23వ తేదీ వరకు మొత్తం 244.46 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది.