Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

10.8.26

Grand Pavithra Samarpaanam Held at Sri Kodanda Rama Swamy Vari Temple






The Pavithrotsavams at Sri Kodandarama Swamy Temple, Tirupati, were conducted with devotion and grandeur on Sunday. As part of the second-day rituals, Pavithra Samarpana was performed as per Agama traditions.

Vedic Rituals Begin with Suprabhatham

The day began with Suprabhatham, followed by Thomala Seva and Sahasranamarchana. The processional deities of Sri Rama with Sita and Lakshmana were then taken to the Yagashala, where Vishwaksena Aradhana, Punyahavachanam, Kumbharadhana and Homa rituals were performed.

Snapana Tirumanjanam Performed

Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Kodandarama Swamy along with Sita and Lakshmana. The deities were ceremonially bathed with milk, curd, honey, sandalwood and coconut water.

Sacred Pavithrams Offered

After due rituals at the Yagashala, the sacred Pavithrams were taken in a ceremonial procession and offered to the Dhruva, Kautuka, Snapana and Bali deities. Pavithrams were also offered to Vishwaksena, Dwarapalakas, Bhashyakaras, Garuda Alwar, the Homa Kundas, Bali Peetham, Dhwajasthambham and Sri Anjaneya Swamy.

Sri Sita Rama Lakshmana to Bless Devotees

In the evening, Sri Sita Rama Lakshmana will bless devotees during a procession on the golden Tiruchi through the temple Mada Streets, followed by Vedic rituals at the Yagashala.

Pavithrotsavams to Conclude on August 10

The Pavithrotsavams will conclude on August 10 with Vedic rituals and Purnahuti at the Yagashala.

Temple Deputy EO Smt. B. Nagarathna, Chief Priest Sri Anand Kumar Dikshitulu, Superintendent Sri K. Srinivasulu Reddy, Temple Inspectors Sri Suresh and Sri Harikrishna, priests, Srivari Sevaks and a large number of devotees participated in the rituals.

శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ pavitrasamarpanam







తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.

సుప్రభాతం నుంచి వైదిక కార్యక్రమాలు

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.

స్వామివారికి స్నపనతిరుమంజనం

సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం కన్నులపండువగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీటితో స్వామివారికి అభిషేకం చేశారు.

వైభవంగా పవిత్రాల సమర్పణ

యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అలాగే విష్వక్సేనుడు, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాళ్వార్‌, హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణుల ఊరేగింపు

సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆగస్టు 10న పవిత్రోత్సవాల ముగింపు

ఆగస్టు 10న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్ కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

9.8.26

Sri Kodandarama Swamy Vari Pavitrotsavams Begin Grandly





The annual Pavitrotsavams of Sri Kodandarama Swamy Temple in Tirupati began on Saturday with devotion and traditional rituals as per Agama scriptures.

Pavitrotsavams to Preserve Temple Sanctity

The Pavitrotsavams are conducted as per Agama traditions to rectify any inadvertent lapses during the daily rituals, worship and festivals performed throughout the year and to preserve the sanctity of the temple.

Snapana thirumanjanam for Sita, Rama and Lakshmana

As part of the festivities, the processional deities of Sri Sita, Rama and Lakshmana were taken to the Yagasala through the Vimana Pradakshina in the morning.

Snapana thirumanjanam was then performed with milk, curd, honey, sandalwood, turmeric and coconut water. Shattumora and Asthanam were subsequently conducted.

Sita, Rama and Lakshmana Take Golden Tiruchi Procession

In the evening, Sri Sita, Rama and Lakshmana were taken in a procession on the Golden Tiruchi along the Mada Streets of the temple, blessing the devotees.

Pavitra Pratishta and Sayanadhivasam

Pavitra Pratishta, Sayanadhivasam and other Vedic rituals will be performed on Saturday night.

Pavitra Samarpana on August 9

Pavitra Samarpana will be performed on the morning of August 9, followed by special Vedic rituals at the Yagasala in the evening.

Deputy EO Smt. B. Nagaratna, Superintendent Sri K. Srinivasulu Reddy, Temple Inspector Sri Suresh Babu, temple priests, Srivari Seva volunteers and a large number of devotees participated in the programme.

వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు pavitrotsavam





తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఆలయ పవిత్రత పరిరక్షణకు పవిత్రోత్సవాలు

ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివృత్తికి, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సీతారామలక్ష్మణులకు వైభవంగా స్నపనతిరుమంజనం

పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు.

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు చేపట్టారు.

బంగారు తిరుచ్చిపై సీతారామలక్ష్మణుల మంగళ విహారం

సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మంగళ విహారాన్ని భక్తులు భక్తిపారవశ్యంతో తిలకించారు.

రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం

ఆగస్టు 9 పవిత్ర సమర్పణ

ఆగస్టు 9న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ బాబు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.