Featured Post

NATIONAL FLOK ARTS ADD SPIRITUAL GRANDEUR TO MUTHYAPU PANDIRI VAHANA SEVA

The Muthyapu Pandiri Vahana Seva during the third day of Srivari Navaratri Brahmotsavams on Wednesday night was enriched by vibrant cultural...

15.10.26

NATIONAL FLOK ARTS ADD SPIRITUAL GRANDEUR TO MUTHYAPU PANDIRI VAHANA SEVA





The Muthyapu Pandiri Vahana Seva during the third day of Srivari Navaratri Brahmotsavams on Wednesday night was enriched by vibrant cultural performances by 415 artists from 16 troupes representing nine states.


Traditional performances, including Mohiniyattam, Sambalpuri, Manipuri, Bihu, Raibenshe, Mayura Nrityam, Kuchipudi, devotional dance dramas and drum performances, showcased India’s rich cultural heritage and Sanatana Dharma.


The performances added spiritual and cultural splendour to Tirumala, captivating devotees witnessing the divine procession of Sri Venkateswara Swamy.

ముత్యపుపందిరి వాహనసేవలో జాతీయ కళారూపాల ఆధ్యాత్మిక వైభవం national folk-art







తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి నిర్వహించిన ముత్యపుపందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 16 కళాబృందాల్లోని 415 మంది కళాకారులు సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో తిరుమలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపారు.


సంప్రదాయ కళారూపాలతో ఆధ్యాత్మిక సందడి


కేరళకు చెందిన మయూర నృత్యం, ఉరియాడ, మోహినీయాట్టం, ఒడిశా సంబల్‌పురి నృత్యం, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ నృత్యం, మణిపురి నృత్యం, పశ్చిమ బెంగాల్ రైబెన్సీ నృత్యం, మహారాష్ట్ర డ్రమ్స్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


తెలంగాణకు చెందిన ‘దేవీ వైభవం’ నృత్యరూపకం, ‘వేణుగాన విహారి’, తమిళనాడుకు చెందిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అస్సాంకు చెందిన బిహు నృత్యాలు భక్తులను అలరించాయి.


భక్తి.. సంప్రదాయం.. కళల సమ్మేళనం


శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పాయి. శ్రీవారి వాహనసేవను దర్శించుకుంటూ, కళారూపాలను వీక్షించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

TTD EO APPRECIATES ARTISTS AT SIMHA VAHANA SEVA




TTD EO Sri Muddada Ravichandra appreciated artists who performed during the Simha Vahana Seva at Tirumala on Wednesday morning. He presented certificates of appreciation and felicitated them with shawls.


Performances included Mahari, Odissi and Manikarnika dances from Odisha, Dasavatharalu from Andhra Pradesh, Halakki Suggi Kunitha from Karnataka, and drum and Yog Chap performances from Maharashtra, showcasing India’s rich cultural heritage.

కళాకారుల ప్రదర్శనలకు టిటిడి ఈవో ప్రశంసలు CULTURAL PROGRAMS






తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన సింహ వాహనసేవలో కళారూపాలను ప్రదర్శించిన కళాకారులను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సన్మానించారు.


ఈ సందర్భంగా వివిధ కళాబృందాలు ప్రదర్శించిన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.


ప్రత్యేకంగా ఆకట్టుకున్న ప్రదర్శనలు:


•  ఒడిశా: DSP ఆధ్వర్యంలో మహారి, ఒడిస్సీ, మణికర్ణిక నృత్యాలు – 28 మంది కళాకారులు.

•  విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్: ఎస్వీసీఎండీ ఆధ్వర్యంలో శ్రీమతి పి. శైలజారెడ్డి బృందం ప్రదర్శించిన ‘దశావతారాలు’ – 39 మంది కళాకారులు.

•  కర్ణాటక: హలక్కి సుగ్గి కునిత జానపద నృత్యం – హరీష్ బృందం, 25 మంది కళాకారులు.

•  మహారాష్ట్ర: హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డ్రమ్స్, యోగ్ చాప్ ప్రదర్శనలు – ఎం.జి. కాథేకర్ బృందం, 75 మంది కళాకారులు.


వివిధ రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల వైభవాన్ని చాటిచెప్పాయి.

SRIVARI APPEARS IN SITA SWAYAMVARAM ALANKARAM ON MUTHYAPU PANDIRI VAHANAM







As part of the Srivari Navaratri Brahmotsavams, Lord Malayappa Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees on the Mutyapu Pandiri Vahanam on Wednesday night.


Recalling the divine bow-breaking episode of Sita Swayamvaram, the Lord appeared as Sri Ramachandra, while the consorts were adorned as Sita and Lakshmana. The divine darshan filled devotees with devotion and spiritual joy.


The grand procession featured cultural performances by various groups, while the Mada Streets reverberated with chants of “Govinda, Govinda.” Large numbers of devotees witnessed the vahana seva.


Pearls symbolise coolness and peace. Devotees believe that having the darshan of the Lord on the Mutyapu Pandiri Vahanam brings peace of mind and auspicious blessings.


The event was attended by the Tirumala Jeeyar Swamijis, TTD Chairman Sri B.R. Naidu, EO Sri Muddada Ravichandra, Additional EO Sri C.H. Venkaiah Chowdary, board members and senior officials.