Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

8.8.26

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు వైదిక వైభవంతో అంకురార్పణ ankurarpanam



తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గస్టు 8 నుండి 10 తేదీ వరకు వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం వే మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి సేనాధిపతి ఉత్సవం, మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను ఆగమోక్తంగా నిర్వహించి, పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఆలయానికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది వల్ల తెలియక జరిగే చిన్నచిన్న దోషాల కారణంగా ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా, వాటికి ప్రాయశ్చిత్తంగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 8న యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, ఆగస్టు 9న పవిత్ర సమర్పణ, వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 10న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ కె. శ్రీనివాసులురెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్‌కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సురేష్‌బాబు, శ్రీ హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

AADI KRITHIKA FESTIVAL CELEBRATED WITH DEVOTION AT SRI KAPILESWARA SWAMY TEMPLE




The auspicious Aadi Krithika festival was celebrated with great religious fervour at Sri Kapileswara Swamy Temple, Tirupati, on Friday. The temple witnessed a large turnout of devotees on the occasion.

Special Snapana Tirumanjanam Performed

In the morning, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Subrahmanyeswara Swamy along with Sri Valli and Sri Devasena.

The deities were ceremonially anointed with milk, curd, honey, sandalwood paste and other fragrant substances. Later, Abhishekam was performed to the presiding deity.

Tiruveedhi Utsavam in the Evening

In the evening, Sri Subrahmanyeswara Swamy along with Sri Valli and Sri Devasena will be taken in a Tiruveedhi Utsavam through the temple streets to bless devotees. A large number of devotees gathered to witness the divine procession.

Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar, temple priests, officials, staff and a large number of devotees participated in the celebrations.

Sri Pattabhishekam Mahotsavams at Valmikipuram Temple from 17th to 19th August




TTD will organise the annual Sri Pattabhishekam Mahotsavams of Sri Pattabhirama Swamy Temple, Valmikipuram, from August 17 to 19 with religious fervour.

The festivities will commence on August 17 with Senadhipathi Utsavam and Ankurarpanam at 6 pm.

Sita Rama Santhi Kalyanam and Hanumantha Vahana Seva on August 18

On August 18, Yagasala Puja will be performed in the morning, followed by Snapana Tirumanjanam at 10 am. Unjal Seva will be held at 5 pm, Sri Sita Rama Santhi Kalyanam at 6.30 pm, and Hanumantha Vahana Seva at 8 pm.

Sri Rama Pattabhishekam and Garuda Vahana Seva on August 19

On August 19, Yagasala Puja and Snapana Tirumanjanam will be performed at 6.30 am, followed by the grand Sri Rama Pattabhishekam at 10 am. Unjal Seva will take place at 6 pm, followed by Garuda Vahana Seva at 7.30 pm, during which Sri Pattabhirama Swamy will bless devotees with His divine darshan. The Mahotsavams will conclude with Mahapurnahuti, Kumbhodvasanam, and Kumbha Prokshanam.

Arjita Seva for Devotees

Couples can participate in the Sri Rama Pattabhishekam Arjita Seva by paying Rs.300. Participants will be presented with one Uttariyam, one blouse piece, and Annaprasadam.

Spiritual and Cultural Programmes.

During the three-day festival, Harikathas, Bhajans, and devotional music programmes will be organised under the auspices of the TTD Hindu Dharma Prachara Parishad and the Annamacharya Project.

TTD has appealed to devotees to participate in large numbers and receive the divine blessings of Sri Pattabhirama Swamy.

ANKURARPANAM PERFORMED FOR SRI KODANDARAMA SWAMY PAVITROTSAVAMS




The Ankurarpanam ceremony for the annual Pavitrotsavams of Sri Kodandarama Swamy Temple, Tirupati, scheduled from August 8 to 10, was performed in a traditional manner on Friday evening.

As part of the rituals, Senadhipati Utsavam, Medhini Puja, Mrutsangrahanam and Ankurarpanam were conducted as per Agama traditions.

Pavitrotsavams are observed every year as a ritual of purification to atone for any inadvertent lapses that may occur in the temple's daily worship and rituals due to human error.

On August 8, Pavitra Pratishtha and Sayanadhivasa will be performed in the Yagasala. Pavitra Samarpana and other Vedic rituals will take place on August 9, while the three-day festival will conclude with Purnahuti on August 10.

TTD JEO Dr. A. Sharath, Deputy EO Smt. Nagaratna, Superintendent Sri K. Srinivasulu Reddy, Chief Priest Sri Anand Kumar Dikshitulu, Temple Inspectors Sri Suresh Babu and Sri Harikrishna, priests, Srivari Sevaks and devotees participated in the ceremony.

ఆగస్టు 17 నుంచి 19 వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు valmikipuram




టీటీడీ ఆధ్వర్యంలోని వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19 తేదీ వరకు శ్రీ పట్టాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో మహోత్సవాలకు శ్రీకారం చుడతారు.

ఆగస్టు 18 శ్రీ సీతారాముల శాంతి కల్యాణం 

హనుమంత వాహనసేవ

ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి.

ఆగస్టు 19 శ్రీరామ పట్టాభిషేకంగరుడ వాహనంపై దివ్య దర్శనం

ఆగస్టు 19న ఉదయం యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం, అనంతరం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహిస్తారు.

రూ.300తో ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం

గృహస్తులు (ఇద్దరు) రూ.300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొన్న దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు

మహోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టిటిడి కోరుతోంది.