4.4.16

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి'లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసే దిశగా వెళుతోంది. 41 ఏళ్ళ కెరీర్‌లో నాటి 'ఎదురులేని మనిషి' నుంచి నిన్నటి 'ఎవడే సుబ్రహ్మణ్యం' వరకు ఎన్నో అఖండ విజయాలు అందుకున్న భారీ చిత్రాల నిర్మాత, మెగా ప్రొడ్యూసర్‌ వైజయంతి మూవీస్‌ అధినేత సి.అశ్వనీదత్‌ 'ఊపిరి' చిత్రాన్ని చూసి తన స్పందనను తెలియజేశారు. 
''ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో ఇంత గొప్ప సినిమా నేను చూడలేదు. ఒక విభిన్నమైన కథాంశంతో ఎంతో లావిష్‌గా అద్భుతంగా ఈ సినిమా తీసిన పి.వి.పి.గారి టేస్ట్‌కి హ్యాట్సాఫ్‌. నా తరం నిర్మాతలందరూ గర్వపడే చిత్రం 'ఊపిరి'. 'గీతాంజలి' తర్వాత నాగార్జున ఎంతో గొప్పగా నటించిన సినిమా 'ఊపిరి'. నాగార్జున అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌కి బ్యాలెన్స్‌డ్‌గా కార్తీ కూడా ఎంతో బాగా చేశాడు. ఇంతకుముందు వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేసిన సినిమాలు చూసి మామూలు దర్శకుడు అనుకున్నాను. కానీ, 'ఊపిరి' చూసిన తర్వాత వంశీ ఒక గొప్ప దర్శకుడు అని ఫీల్‌ అయ్యాను. 'ఊపిరి' చిత్రాన్ని వంశీ మలచిన తీరు అద్భుతం. ఈ సినిమా అఖండమైన విజయాన్ని సాధించినందుకు సాటి నిర్మాతగా నేనెంతో ఆనందిస్తున్నాను. 'ఊపిరి'లాంటి మంచి సినిమాని తీసిన పి.వి.పి. యూనిట్‌ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

No comments :
Write comments