28.7.16

Naga Chaitanya, Goutam Menon's Sahasam Swasaga Sagipo releasing on 19th Aug

యువసామ్రాట్‌ నాగచైతన్య, డీసెంట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం 'ఏమాయ చేసావె' తర్వాత మళ్ళీ ఈ హిట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో విభిన్న తరహా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేసావె' మ్యూజికల్‌గా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందిన మరో మ్యూజికల్‌ సెన్సేషన్‌ 'సాహసం శ్వాసగా సాగిపో'. ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోన్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో వుంది చిత్ర యూనిట్‌. 
యువసామ్రాట్‌ నాగచైతన్య, మంజిమ మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: డాన్‌మాక్‌ ఆర్థర్‌, ఎడిటింగ్‌: ఆంటోని, ఆర్ట్‌: రాజీవన్‌, ఫైట్స్‌: సిల్వ, రచన, సమర్పణ: కోన వెంకట్‌, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌. 

No comments :
Write comments