తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రతి సంవత్సరం కార్తీక స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించడంఆనవాయితీ.
ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో 17వ తేది శుక్రవారంనాడు ఉదయం 10.30 గంటల నుండి 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాన్ని ఘనంగానిర్వహించారు. ఈ అభిషేకంలో తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, ఆర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








No comments :
Write comments