తిరుపతి, 18 నవంబరు 2017 ; తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి శనివారం 5 గొడుగులు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులతోపాటు పట్టువస్త్రాలను అధికారులకు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రాధాకృష్ణ, సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments