తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం, సీఆర్వో అభివృద్ధి మరియు ఆధునీకరణ పై టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఈ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి సంబంధిత నిపుణులు తాము రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈవో మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల పర్యావరణ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి రూప కల్పన చేయాలన్నారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
అదే విధంగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) ఆధునీకరణపై కూడా ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఆర్వో చుట్టు పక్కల ఉన్న ఖాళీ ప్రాంతాలను కూడా భక్తులకు సౌకర్యవంతంగా తీర్చి దిద్దేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఈ సమావేశాల్లో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీఈ శ్రీ సత్యనారాయణ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ నిపుణులు శ్రీ రాముడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments