1.5.25

కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్





తమిళనాడులోని ప్రసిద్ధ కంచి పుణ్యక్షేత్రం లో బుధవారం జరిగిన కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి నియామక వేడుకకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు హాజరయ్యారు.

అన్నవరానికి చెందిన శ్రీ దుడ్డు సుబ్రహ్మణ్య గణేష శర్మ కు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సన్యాస దీక్షను అనుగ్రహించి శిష్య స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాధికారిగా నియమితులైన వేదపండితోత్తమ శ్రీ గణేష్ శర్మకు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా నామకరణం చేశారు.
ఈ వేడుకకు హాజరైన టీటీడీ చైర్మన్ పీఠాధిపతి, ఉత్తరాధికారులకు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి టీటీడీ చైర్మన్ తో మాట్లాడుతూ తిరుమలతో కంచి పీఠానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో ధార్మిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, టీటీడీ తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా తమ పీఠాన్ని సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణ, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురు రాజ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments