29.5.25

శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం






జూన్ 2 నుండి 10వ తేది వరకు నిర్వహించనున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు.


తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ కు అర్చకులు వేద ఆశీర్వచనం చేసారు. 

ఈ సందర్భంగా చైర్మన్ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments