11.5.25

రిషికేశ్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ




ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేశ్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది.

మే 11వ తేది ఉద‌యం 10.50 నుండి 11.15 గంట‌ల మ‌ధ్య‌ ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.
మే 11 నుండి 19వ తేది వ‌ర‌కు ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ శివప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మే 11 నుండి 19వ తేది వరకు జరగనున్న జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శ‌నివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

మే 11న ధ్వజారోహణం

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆదివారం ఉదయం 8.15 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆగమోక్తంగా ధ్వజారోహణం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు జరగనున్నాయి.
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, ఆలయ ఇన్స్పెక్టర్ మోహన్, భక్తులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌
న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ‌నివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
మే 11వ తేదీ ఉదయం 6 నుండి 8.07 గంటల మ‌ధ్య వృషభ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
మే 11 నుండి 19వ తేది వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ప్రత్యేక అధికారి శ్రీ రామారావు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments