తిరుమలలో ఆదివారం రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమై రాత్రి 9గం వరకు కొనసాగింది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడంతో తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments