14.5.25

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు మరియు లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఛైర్మన్











 తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, లడ్డూ కౌంటర్లను

మంగళవారం సాయంత్రం టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీు చేపట్టారు.
ముందుగా ఆయన శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనాన్ని తనిఖీ చేసి, వంటల తయారీ, వంట సామాగ్రి నిల్వ మరియు శుభ్రతను పరిశీలించారు.
అనంతరం భక్తులతో ఆయన ముచ్చటించి వారికి వడ్డిస్తున్న అన్నప్రసాదం నాణ్యతపై భక్తులు నుండి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అన్నప్రసాదం నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు అపారమైన సంతృప్తిని వ్యక్తం చేశారు.
నంతరం లడ్డూ కౌంటర్లను తనిఖీ చేసి క్యూ లైన్లను మరియు లడ్డూల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
లడ్డూల నాణ్యత, పరిమాణం మరియు రుచిపై భక్తుల నుండి అభిప్రాయాలను కనుక్కొన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యత మెరుగుపడటం పట్ల భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments