23.5.25

తిరుమ‌ల‌లో ఘనంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు












హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా గురువారం తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో, మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద టీటీడీ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి ఉదయం అభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ శ్రీ బి ఆర్ నాయుడు, అదనపు ఈఓ శ్రీ సి హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
కాగా సాయంత్రం 3 గంట‌ల‌కు మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం విగ్ర‌హం వ‌ద్ద‌ వేద మంత్రోచ్చారణలు మేళ‌తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అస్థానం వేడుకగా నిర్వహించారు. అనంతరం భ‌క్తుల‌కు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments