6.5.25

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మైన కీలప‌ట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు





చిత్తూరు జిల్లా గంగ‌వ‌రం మండ‌లంలోని కీలప‌ట్ల శ్రీ కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమ‌వారం ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి.

ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంట‌ల మధ్య క‌ర్కాట‌క‌ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో భాగంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ఘట్టాన్ని నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.
ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అంతకుముందు గ్రామ పోలిమేరలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు పెద్ద‌శేష‌ వాహనంపై శ్రీ కోనేటిరాయ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. గజేంద్ర ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్ర‌తిరోజూ రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
05-05-2025
సాయంత్రం – పెద్ద శేష వాహనం
06-05-2025
ఉదయం – చిన్న శేష‌వాహ‌నం
సాయంత్రం – హంస వాహనం
07-05-2025
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
08-05-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
సాయంత్రం – సర్వభూపాల వాహనం
09-05-2025
ఉదయం – మోహినీ ఉత్సవం
సాయంత్రం – శ్రీవారి కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
12-05-2025
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం
13-05-2025
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

No comments :
Write comments