24.5.25

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌మాణస్వీకారం






టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా తుడ ఛైర్మ‌న్ శ్రీ దివాక‌ర్ రెడ్డి శుక్ర‌వారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ దివాక‌ర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్ర‌శాంతి, విజిఓ శ్రీ సురేంద్ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments :
Write comments