23.5.25

టిటిడి ఆలయాల్లో వైభవంగా హ‌నుమ‌జ్జ‌యంతి




శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీలోని స్థానికాల‌యాల్లో వెల‌సిన‌ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

తిరుపతిలోని శ్రీ గోవింద రాజ‌స్వామి ఆల‌యం వ‌ద్ద ఉన్న ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్డులోని మఠం ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్ వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపం వద్ద ఉన్న‌ శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేశారు.

No comments :
Write comments